వెల్దండ: మండల కేంద్ర సమీపంలో కల్వకుర్తి ఎకై ్సజ్‌శాఖ అధికారులు బుధవారం వాహనాల తనిఖీ చేస్తుండగా.. 600 కేజీల నల్లబెల్లం, 120 కేజీల పటిక స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. హైదరాబాద్‌లోని బేగంబజార్ గంజ్ నుంచి స్కార్పియో వాహనంలో రంగారెడ్డి జిల్లా తలకొండ మండలంలోని మెగ్లితండాకు చెందిన ఇస్లావత్ రాజు అక్రమంగా నల్లబెల్లం, పటిక మన్ననూర్ గ్రామానికి తరలిస్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. వాహనంలో తరలిస్తున్న 20 బస్తాలు (600 కేజీలు) నల్లబెల్లం, 120 కేజీల పటికను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేసి రాజుపై కేసు నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది జనార్దన్‌రెడ్డి, సిదార్థ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో
సెక్యూరిటీ గార్డులు
దురుసుగా ప్రవర్తన
అమీర్‌పేట: సనత్‌నగర్ ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన వారి పట్ల సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రోగులు ఆరోపించారు. మహిళా సెక్యూరిటీ గార్డు ఏకంగా చేయిచేసుకునేందుకు యత్నించిందని ఓ రోగి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.వివరాల్లోకి వెళ్తే..జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఎలక్ట్రిషియన్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆకుల వెంకటేష్ చికిత్స నిమిత్తం ఈఎస్‌ఐ ఆస్పత్రికి వచ్చాడు. కన్ను, వెరికోవేన్స్ సమస్యతో బాధపడుతున్న అతడికి వైద్యులు పరీక్షలు చేసి కంటికి లెన్స్ వేయాలని, లెన్స్ వచ్చాక సమాచారం ఇస్తామని పంపించారు. గత శుక్రవారం ఫోన్ చేసి ఆసుపత్రికి రావాలని చెప్పడంతో వచ్చి ఆసుపత్రిలో చేరాడు.వెంకటేష్‌తో పాటు మరో 10 మంది ఓపీడీకి తీసుకెళ్తున్న సమయంలో మహిళా సెక్యూరిటీ గార్డు రోగులను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించడమే కాకుండగా మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని దుర్భాషలాడుతూ చేతిలో ఉన్న పెన్నుతో చేయి చేసుకునేందుకు ప్రయత్నించిందని వెంకటేష్ తెలిపాడు. వైద్యులు రమ్మన్నారని చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. వైద్యులు, నర్సులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నా, ఇతర సి బ్బంది పనితీరు సరిగా లేదని వెంకటేష్ అన్నా రు. ఆస్పత్రిలో నీటి కొరత తీవ్రంగా ఉందని, రోగులకు ఇస్తున్న ఆహారంలో అస్సలు నాణ్య త ప్రమాణాలు పాటించకుండా నాసీరకం ఆహారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.


