● ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత, యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి
నవాబుపేట:లక్ష్యం ఎంచుకుని ముందుకు సాగాల ని అప్పుడే.. మన టార్గెట్ పూర్తవుందని.. లక్ష్యసాధనలో ఆలస్యం కావచ్చు.. ఇబ్బందులు రావచ్చు.. వాటిని అధిగమించి ముందుకు సాగితే లక్ష్యం తప్పక చేరుకుంటాం.. ఇది నేను పాటించి విజయం సాధించి నేడు మీ ముందు నిల్చుని మీరు పాటించి ఉన్న శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ తన విజయ రహస్యం చెప్పుకొచ్చారు ఎంఎస్‌ఎన్ ఫార్మ అధినేత, యాదగిరిగుట్ట ట్రస్టుబోర్డు చైర్మన్ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం తాను పుట్టిన గ్రామం, తాను చదివిన బడికి రూ.రెండున్నర కోట్లతో నిర్మించిన పాఠశాల అధునాతన భవనాన్ని విద్యార్థులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను డిగ్రీ వరకు ప్రభుత్వ బడుల్లోనే చదివినట్లు తెలిపారు. తాను కళాశాలలో లెక్షరర్‌గా పనిచేసి సొంతంగా ల్యాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం తాజాగా వందకు పైగా దేశాల్లో కంపెనీ మార్కెటింగ్, 26 ఫార్మ బ్రాంచులు ఉన్నట్లు తెలిపారు. అలాగే తన కంపెనీలలో దాదాపు 30వేల మంది ఉపాధి ిపొందుతుంటే దాదాపు పదివేల మంది పాలమూరు జిల్లా వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. అందుకే తాను చదివిన పాఠశాలను అధునాతన పద్ధతిలో కంపెనీ ద్వారా ఖర్చు చేసి అధ్యాపకులను సైతం నియమించినట్లు తెలిపారు. విద్యకు ఎలాంటి చేయూతనిచ్చేందుకు తాను ముందుంటానని వివరించారు. విద్యముందు ఆస్తులు ఒక లెక్కకాదని ఆస్తులుంటాయి.. పోతాయి.. విద్యాజనం తరిగిపోదన్నారు.
● ఇప్పటికే గ్రామంలో రూ.కోట్లాది రూపాయలతో రోడ్లు, అండర్ డ్రెయిన్, విద్యుత్‌లాంటివి ఏర్పాటు చేశామని, తాజా విద్యను కార్పోరేట్ స్థాయిలో అందరికీ అందిస్తున్నామన్నారు. త్వరలోనే వైద్యానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ నర్సింహులు, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, గురుకుంట మాజీ సర్పంచ్ ప్రతాప్‌రెడ్డి, ఎంఈఓ నాగ్యనాయక్, ఎంఎస్‌ఎన్ కంపెనీ అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రతాప్, రవి, శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, ఉపసర్పంచ్ రాజశేఖర్, పురుషోత్తం తదితరులు ఉన్నారు.


