మక్తల్: పట్టణంలో వీధికుక్కలు ఏడుగురిపై దాడి చేసి బీభత్సం సృష్టించాయి. 16వ వార్డు అనంపల్లి వీధికి చెందిన పలువురిపై దాడి చేయడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో మహేశ్వరి అనే మహిళను మెరుగైన చికిత్స కోసం నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏడుగురిపై ఒకేసారి దాడికి పాల్పడటంతో పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ బజార్‌లో కుక్కలు బెడద అధికంగా ఉందని, మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


