ఈసారి వర్షాలు లేక పత్తి పంట ఎండుముఖం పట్టింది. మొక్కల ఎదుగుదల కూడా మందగించింది. మరో వారం రోజులు వర్షం పడకపోతే పంట దెబ్బతింటుందనే ఆందోళనలో ఉన్నాం. ఇప్పుడు కురిసిన వర్షంతో పొలంలో తేమ పెరిగింది. పత్తి మళ్లీ కోలుకునే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు, మూడు వర్షాలు కురిస్తే దిగుబడిపై మంచి ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం కలుపు నివారణ, అంతర కృషి పనులు చేపట్టి పంటలను కాపాడుకుంటాం.
– చంద్రయ్య, రైతు, ఫర్దీపూర్ గ్రామం,
చిన్నచింతకుంట మండలం
కురిసిన వర్షం పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న వంటి ఆరుతడి పంటలకు ఎంతో మేలు చేస్తుంది. వర్షం తర్వాత పంటల్లో పురుగులు, శిలీంధ్ర వ్యాధులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. రైతులు తప్పనిసరిగా పొలాలను పరిశీలిస్తూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పత్తిలో రసం పీల్చే పురుగులు, ఆకుమచ్చ, తెగుళ్లను ఎప్పటికప్పుడు గమనించి, ఆర్థిక నష్ట పరిమితి దాటినప్పుడే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు తగిన పురుగుమందులు పిచికారీ చేయాలి. మొక్కజొన్న, కంది పంటల్లో కూడా పురుగు, వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే ఏఈఓలను సంప్రదించాలి. నేలలో తేమ ఉన్న సమయంలో కలుపు నివారణ, అంతరకృషి, సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి పెడితే పంట ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది. రైతులు క్షేత్రస్థాయిలో పంటలను నిరంతరం పరిశీలిస్తూ శాసీ్త్రయ సస్యరక్షణ చర్యలు పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చు. – గోవింద్‌నాయక్,
జిల్లా వ్యవసాయశాఖ అఽధికారి


