మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్బగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలతో కల్యాణం వేడుకను జరిపించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి పల్లకిలో గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరిరామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.


