అడ్డంకులు తొలగేనా..? | - | Sakshi
Sakshi News home page

అడ్డంకులు తొలగేనా..?

Jul 30 2026 4:54 AM | Updated on Jul 30 2026 4:54 AM

ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య 65 శాతం పూర్తి..

ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు భూసేకరణ సమస్య

జిల్లాలోని నెట్టెంపాడు, ఆర్డీఎస్‌, గట్టు ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశాం. సేకరించాల్సిన భూమిలో ఇప్పటికే 65శాతం భూమిని సేకరించాం. మల్లమ్మకుంట రిజార్వాయర్‌కు సంబంధించి రైతులతో ఇప్పటికే రెండు పర్యాయాలు సమావేశం ఏర్పాటుచేశాం. కాని రైతుల నుంచి సానుకూలత రాలేదు. మరోసారి సమావేశం ఏర్పాటుచేసి మలమ్మకుంట రిజర్వాయర్‌కు ఇబ్బందులను తొలగిస్తాం. – రిజ్వాన్‌ బాషా షేక్‌,

కలెక్టర్‌, జోగుళాంబ గద్వాల

గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూముల్లో సాగునీటిని పారించి సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నా యి. పాలమూరు–రంగారెడ్డి, ఎంజీకేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతో పాటు ఆర్డీఎస్‌ ప్రాజెక్టుల ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందాల్సి ఉండగా.. అసంపూర్తి పనులతో కేవలం 6–7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. పెండింగ్‌ పనులకు నిధుల లేమితో పాటు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శివకుమార్‌నాయుడు జిల్లాల వారీగా ఇరిగేషన్‌, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షిస్తూ.. భూ సేకరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

నెట్టెంపాడు ప్రాజెక్టులోని

గూడెందొడ్డి రిజర్వాయర్‌

భూ సేకరణ పూర్తయితేనే పెండింగ్‌ పనులు ముందుకు

పాలమూరు ప్రాజెక్టుల పూర్తిపై

సీఎం ప్రత్యేక దృష్టి

అధికారులతో ఆర్‌అండ్‌ఆర్‌

కమిషనర్‌ వరుస సమీక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement