జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వీబీజీ రాంజీ అధిక శ్రమ ఆధారిత, ఉత్పాదకతను పెంచే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సూచించారు. జిల్లాలో చేపడుతున్న వీబీజీ రాంజీ పనులపై బుధవారం కలెక్టరేట్‌లో వెబ్‌ఎక్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కొనసాగుతున్న పనులు, కూలీల వినియోగం, పనుల పురోగతి, సకాలంలో పూర్తి చేయడం, నాణ్యతా ప్రమాణాల అమలు, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో ఉపాధి కల్పించడంతో పాటు, ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే మన్నికై న సామాజిక ఆస్తుల సృష్టిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పనుల అమలులో నాణ్యతను కచ్చితం ్డగా పాటిస్తూ, ప్రతి పనిని నిర్దేశిత గడువు గా పూర్తి చేయాలని సూచించారు. స మావేశంలో జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, హౌసింగ్ పీడీ ఉపేందర్‌రెడ్డి, ఎంపీడీఓ లు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, ఈసీలు పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో
బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
మెట్టుగడ్డ: దేశంలో సగ భాగానికి పైగా ఉన్న బీసీల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని నిర్మిస్తామని, బీసీలను ఏకం చేసి ఉద్యమ జ్వాలను రగిలిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యానిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. ఆగస్టు 7న బెంగళూరులో జరిగే జాతీయ ఓబీసీ మహాసభ వాల్‌పోస్టర్‌ను బుధవారం జిల్లాకేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రాజకీయ రిజర్వేషన్ల బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఈ వర్షాకాల సమావేశాల్లోనే మహిళా బిల్లు, డీ లిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తోందని, బీసీ బిల్లు లేకుండా ప్రవేశపెట్టే ఈ బిల్లులను అన్ని పార్టీలు అడ్డుకోవాలన్నారు. నాయకులు చంద్రశేఖర్, మహేష్‌యాదవ్, దోమ వెంకటేష్, జ్ఞానేశ్వర్, వేణుగౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.


