గృహకల్పలో కూలిన బాల్కనీ రెయిలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

గృహకల్పలో కూలిన బాల్కనీ రెయిలింగ్‌

Jul 30 2026 4:54 AM | Updated on Jul 30 2026 4:54 AM

బ్లాక్‌ నం.1, 3వ

అంతస్తులో ఘటన

పరిశీలించిన అడిషనల్‌

కలెక్టర్‌, ఆర్‌డీఓ

దేవరకద్ర మార్కెట్‌కు అమ్మకానికి వచ్చిన ఉల్లి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగరంలోని 11వ డివిజన్‌ బండమీదిపల్లిలోని రాజీవ్‌ గృహకల్ప ఒకటో బ్లాక్‌, 3వ అంతస్తులో మంగళవారం రాత్రి బాల్కానీ రెయిలింగ్‌ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌రెడ్డి అక్కడికి వెళ్లి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం ఉదయం సంఘటన స్థలాన్ని స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ఓవర్‌హెడ్‌ నీటి ట్యాంకులతో పాటు కొన్ని భవనాల పైకప్పులు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో గృహకల్పలో నివసిస్తున్న వారికి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఈ భవన సముదాయంపై సమగ్ర సాంకేతిక (స్ట్రక్చరల్‌) తనిఖీ నిర్వహించి నిర్మాణ స్థిరత్వంపై పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. తనిఖీలో ఆర్‌డీఓ ఇ.నవీన్‌, అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ (ఏఎంసీ) శ్రీనివాస్‌యాదవ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ, ఏఈ నుస్రత్‌ పాల్గొన్నారు.

నిర్వహణ సరిగా లేక..

రాజీవ్‌ గృహకల్ప సముదాయాన్ని ఎకరాన్నర విస్తీర్ణంలో 12 బ్లాకులను (జీ ప్లస్‌ త్రీ) నిర్మించగా.. దీనికి 2007 మార్చిలోప్రారంభోత్సం చేశారు. మొత్తం 384 ఫ్లాట్లు ఉండగా అనంతరం కాలనీ సంక్షేమ కమిటీ ఏర్పాటైంది. అయితే దీని నిర్వహణను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 20 ఏళ్లు దాటినా ఏనాడూ కనీసం సున్నం వేసిన దాఖలాలు లేవని ఎక్కడికక్కడ ప్లాస్టరింగ్‌ ఊడిపోతోందని వాపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement