● 1969లోనే తెలంగాణ తొలి ఉద్యమం
● తూటాలకు బలైన ఇంజినీరింగ్ విద్యార్థి
● నాటి ఉద్యమకారుల సంఘం
జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు
అలంపూర్ రూరల్: తెలంగాణ తొలి ఉద్యమం 1969 లోనే ప్రారంభం కాగా.. పోలీసులు కాల్పులు జరిపినా.. కొరడాలు ఝులిపించినా ఉద్యమం తగ్గలేదని నాటి ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు అన్నారు. అలంపూర్ పట్టణంలోని తెలంగాణ హరిత అతిథి గృహంలో మంగళవారం తెలంగాణ తొలి ఉద్యమకారుల సమీక్ష సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ.. 1969, ఏప్రిల్ 7న గద్వాలలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇంజినీరింగ్ విద్యార్థి సర్వారెడ్డి బలయ్యారని గుర్తుచేసుకున్నారు. 1969, ఏప్రిల్ 9న జరిగిన సర్వారెడ్డి అంతిమ యాత్రలో మరొక బాలుడు కొట్టం వేణుగోపాల్ పోలీసుల తూటాలకు బలైన సందర్భంగా యావత్ గద్వాల ప్రాంతం విద్యార్థి సంఘాల యాక్షన్ కమిటీ పాఠశాలలు, కళాశాలలను నిరవధికంగా బంద్ చేయడంతో పాటు పరీక్షలు కూడా బహిష్కరించారని తెలిపారు. నాటి ఉద్యమంలో 370 మంది బలిదానం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, ఉద్యమ సమయంలో చురుకై నా పాత్ర పోషించి పోలీసు కేసులున్న వారికి, 1969లో స్కూల్ అండ్ కాలేజీలో నిరవధికంగా పరీక్షలు రాయని వారు కూడా సంక్షేమ పథకాలకు అర్హులేనన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరుతూ 2023 అక్టోబర్‌లో ఽహైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో మహాధర్నా చేపట్టగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. 28 మే, 2024న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఎంపీ మల్లు రవికి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. గద్వాల జిల్లాలో నిర్వహించనున్న విస్తృత స్థాయి సమవేశాలకు నాటి విద్యార్థుల యొక్క కుటుంబ సభ్యులు హాజరు కావాలని మోహన్‌రావు కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అబ్దుల్ మోమిన్, నాగన్‌గౌడ్, ప్రభాకర్, కొట్టం రవి, మాణిక్యరెడ్డి, అచ్చన్న గౌడ్, రాంగోపాల్, సర్వరెడ్డి, అక్బర్‌బాషా, శాలిమియ్యా, సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


