మార్కెట్‌లోకి న్యూ బ్రెజ్జా | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి న్యూ బ్రెజ్జా

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

పాలమూరు: మారుతీ షోరూం నుంచి మార్కెట్‌లోకి నూతనంగా వచ్చిన న్యూ బ్రెజ్జా కారును సోమవారం శ్రీరామ జయరామ షోరూంలో మేయర్‌ మమత, డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షోరూం అధినేత బెక్కరి రాంరెడ్డి మాట్లాడుతూ.. న్యూ బ్రెజ్జ కారు 1000 సీసీ సరికొత్త కె సిరీస్‌ టర్బో ఇంజిన్‌ కలిగి ఉందన్నారు. రియర్‌ ఏసీ వెంట్స్‌, 6ఎయిర్‌ బ్యాగ్స్‌ పెట్రోల్‌ వెర్షన్‌లో 19.96 మైలేజ్‌ వస్తుందన్నారు. డిజిటల్‌ ఏసీ ప్యానెల్‌, 365కెమెరా, ఆరు రంగుల్లో లభిస్తుందన్నారు. కారు ఎక్స్‌ షోరూం ధర 7.39లక్షల నుంచి రూ.11.31లక్షల వరకు అందుబాటులో ఉందని తెలిపారు. కార్యక్రమంలో 43వ కార్పొరేటర్‌ ప్రశాంత్‌, సీఈవో విక్రమ్‌, సరసయ్య, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

వన్యప్రాణులు, అడవులపై అవగాహన ఉండాలి

లింగాల: వన్యప్రాణులు, అడవులపై విద్యార్థులలో అవగాహన కల్పించడమే ‘వనజీవ విద్య’ ఉద్దేశ్యమని హైటీకోస్‌ నల్లమల ల్యాండ్‌స్కేప్‌ కోఆర్డినేటర్‌ బాపురెడ్డి అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌ టైగర్‌ కన్జర్వేషన్‌, అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో ‘వనజీవ విద్యశ్రీపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్‌ బాపురెడ్డి అడువులు, వన్యప్రాణుల రక్షణ, ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వి ద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీ లు నిర్వహించి విజేతలకు స్టీల్‌ వాటర్‌ బాటిళ్లను బహుమతులుగా అందజేశారు. కార్యక్రమంలో హైటీకోస్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ అఖి ల్‌, బయాలజిస్ట్‌ రవికాంత్‌, బీట్‌ అధికారులు మురళీ, ఖాదర్‌పాష, ప్రవీణ్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ శ్రీనివాసు లు, పాఠశాల, హైటీకోస్‌ సిబ్బంది ఇమ్మాన్యుయేల్‌, ప్రేమ్‌కుమార్‌, ఆంజనేయులు, గణేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement