ఆ నాయకులను చట్టసభల నుంచి బర్తరఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆ నాయకులను చట్టసభల నుంచి బర్తరఫ్‌ చేయాలి

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: హింస, అఘాయిత్యాలు, సామాజిక లింగ వివక్ష, అన్యాయాలకు బలవుతున్న అమాయక బాధితులకు న్యాయం చేసే చట్టాలు తయారు చేసే అత్యున్నత చట్టసభల్లో నేర ప్రవృత్తి కలిగిన నాయకులను బర్తరఫ్‌ చేయాలని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ భవన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న భారతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా 12వ మహాసభలు సోమవారం ముగిశాయి. మహిళా బాధితులకు న్యాయం చేయడం కోసం స్వయం ప్రతిపత్తితో నిర్మితమైన జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు పాలకవర్గాల ఆధిపత్యం నుంచి బయటికి రావాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్‌, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకులు భార్గవి, పద్మావతి పాల్గొన్నారు.

తీర్మానాలు.. కమిటీ ఎన్నిక

భారతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా 12వ మహాసభల్లో పలు తీర్మానాలు చేయడంతోపాటు జిల్లా నూతన కౌన్సిల్‌ ఎన్నికలు నిర్వహించారు. పొదుపు సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, స్వయం ఉపాధి రుణాలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఇవ్వాలని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమ లు చేయాలని, మహిళా ఉద్యోగులకు రుతుస్రవ ప్రత్యేక సెలవులు ఇవ్వాలని, మహిళా సమగ్ర విధా నం ప్రకటించాలని తదితర తీర్మానాలు ఆమోదించారు.

● జిల్లా కమిటీ నూతన అధ్యక్షురాలిగా భార్గవి, గౌరవాధ్యక్షురాలిగా రచయిత్రి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పద్మావతి, కోశాధికారిగా ఇందిర, ఉపాధ్యక్షురాలుగా సువర్ణ, అంజమ్మ, జిల్లా సహాయ కార్యదర్శిగా అరుణ, సభ్యులుగా వరలక్ష్మి, శ్రీవిద్య, మొగులమ్మ, అంజమ్మ, సుగుణ, సరిత, మాధవిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement