యజ్ఞాలు వేద వైభవానికి పునాదిరాళ్లు | - | Sakshi
Sakshi News home page

యజ్ఞాలు వేద వైభవానికి పునాదిరాళ్లు

Jul 28 2026 1:12 AM | Updated on Jul 28 2026 1:12 AM

కల్వకుర్తి రూరల్‌: యజ్ఞ, యాగాదులు వేద వైభవానికి పునాదిరాల్ల వంటివని ఎమ్మెల్యే కసిరెడ్డి నారా యణరెడ్డి అన్నారు. పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ మైదానంలో నిర్వహిస్తున్న 91వ విశ్వశాంతి మహాయాగంలో సోమవారం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతలు రుద్రసహిత, మృత్యుంజయ పాశుపతాస్త్ర చంద్రహోమాలు నిర్వహించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ దైవభక్తిని కలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌ యాగశాల ప్రదక్షిణలు చేసి స్వామిజీ ఆశీస్సులు తీసుకున్నారు. దైవచింతన, భక్తి భావం మనసుకు ప్రశాంతత అందిస్తుందన్నారు. యాగ ఫలితం అందరికీ అందాలన్నారు. విష్ణు పంచాయతనం ఆయుత చండీ, అతిరుద్రం, సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమాలతో పాటు కల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుగుతున్నాయి. శిశుమందిర్‌ పాఠశాల విద్యార్థుల నృత్య ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్‌ చైర్పర్సన్‌ బృంగి రత్నమాల ఆనంద్‌కుమార్‌, సురేందర్‌రెడ్డి, జూలూరు రమేష్‌బాబు, కాయతి విజయ్‌ కుమార్‌రెడ్డి, యాగ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement