జడ్పీసెంటర్: జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ వేగవంతం చేసి, గడువులోగా వందశాతం డిజిటలైజేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ ఖుష్బూగుప్తా అధికారులను సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు వాటిని పూర్తిగా నింపి వెంటనే బీఎల్‌ఓలకు ఇవ్వాలని చెప్పారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వని ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు కావని, దీంతో వారు ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సకాలంలో సమర్పించి, ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు నమోదయ్యేలా చూసుకోవాలని సూచించారు.
ఫిర్యాదులు
స్వీకరించిన ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులతో ఎస్పీ జానకి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ సమస్యలపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించే బాధ్యత పోలీసులపై ఉందన్నారు.
నేడు కార్పొరేటర్లకు శిక్షణ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మున్సిపల్ కా ర్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందిన కార్పొరేటర్ల కు మంగళవారం హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనునున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మొదటిసారి కార్పొరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నా రు. ఇందులో ‘కెపాసిటీ బిల్డింగ్, ఇట్రైనింగ్ ప్రోగ్రాం, ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నేషన ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం 8 గంటలకు 60 మంది కార్పొరేటర్లు బస్సులో హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను వార్డు ఆఫీసర్ల ద్వారా కార్పొరేటర్లకు అందజేశారు.
రేపు స్పాట్ అడ్మిషన్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ డైట్, ప్రైవేటు కళాశాలల్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి గల విద్యార్థులకు రెండో దశ స్పాట్ అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మెరాజుల్లాఖాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ డైట్ కళాశాల, గురువారం ప్రైవేటు కళాశాలలకు స్పాట్ కౌన్సెలింగ్ మెట్టుగడ్డ వద్ద ఉన్న డైట్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.


