ప్రజలు బాధ్యతగా ఉంటేనే నేరాలు తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

ప్రజలు బాధ్యతగా ఉంటేనే నేరాలు తగ్గుముఖం

Jul 27 2026 1:12 AM | Updated on Jul 27 2026 1:12 AM

భూత్పూర్‌: ప్రజల సహకారం అందిస్తే పోలీసులు భద్రత కల్పిస్తారని, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాలపై యువత దూరం ఉండాలని, ఇలాంటి వాటికి పాల్పడితే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచా రం ఇవ్వాలని అదనపు ఎస్పీ రత్నం అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని 1వ వార్డు డబుల్‌బెడ్రూం కాలనీలో ఎస్పీ జానకి ఆదేశానుసారం కమ్యూనిటీ కాంటాక్టు నిర్వహించారు. ప్రజల్లో శాంతిభద్రత, నేరాల నియంత్రణ, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నట్లు ఏఎస్పీ సూచించారు. గ్రామాలు, కాలనీల్లో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులు, 100, 112 నంబర్లకు డయిల్‌ చేసి సమాచా రం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వ్యక్తు ల వివరాలు గోప్యంగా ఉంచనున్నట్లు పేర్కొన్నా రు. భద్రతలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉన్న ట్లయితే నేరాలు కొంతమేర అరకట్టడానికి పోలీసులకు సహకరించిన వారవుతారని ఏఎస్పీ చెప్పా రు. డీఎస్పీ రమణారెడ్డి, భూత్పూర్‌ సీఐ రామకృష్ణ, 1–టౌన్‌ సీఐ అప్పయ్య, భూత్పూర్‌ ఎస్‌ఐ నాగన్న, 9మంది ఎస్‌ఐలు, 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు కమ్యూనిటీ కాంటాక్టులో 41మోటర్‌ సైకిళ్లు, కారు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు అదుపులో ఆరుగురు అనుమానితులు

కమ్యూనిటీ కాంటాక్టులో భాగంగా డబుల్‌బెడ్రూంలోని 24 బ్లాక్‌ల్లో సోదాలు నిర్వహించారు. రామ్‌చరణ్‌, శివ ఇంట్లో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన నలుగురు యువకులకు సంబంధించి ఆధార్‌ కార్డులు లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో దేవరకద్ర నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 70మంది పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement