గండేడ్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా కారు అదుపుతప్పి వలస కూలీలపైకి దూసుకెళ్లిన ఘటనలో డ్రైవర్‌తోపాటు ముగ్గురు వలస కూలీలకు గాయాలైన ఘటన శనివారం మండలంలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన 20మంది కూలీలు నేషనల్ హైవేపై చెట్లు నాటడానికి వచ్చారు. వీరంతా నాలుగైదు రోజులుగా మండలంలోని ఆయా గ్రామాల పరి ధిలో నేషనల్ హైవేకు ఇరువైలాపులా చెట్లు నాటుతున్నారు. ఆదివారం కూడా కొంరెడ్డిపల్లి–అంచన్‌పల్లి మ ధ్య నేషనల్ హైవేకు కిందివైపు మొక్కలు నాటుతున్నారు. 12 గంటల సమయంలో కొంరెడ్డిపల్లికి చెందిన శేఖర్ గండేడ్‌కు కారు లో పనిమీద వెళ్తుండగా.. పనిప్రదేశానికి రాగానే కారు అదుపుతప్పింది. ఒక్కసారిగా కారు అడ్డంగా తిరిగి కూలీలపైకి దూసుకెళ్లింది. మొక్కలు నాటుతున్న వలస కూలీల్లో భార్యాభర్తలైన విజయ్, రంజీభాయితోపాటు బాలాజీనాయక్, ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో రంజీభాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.


