మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు నగరం మెయిన్ స్టేడియంలోని బాలుర కబడ్డీ అకాడమీలో ప్రవేశాల ఎంపికలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అకాడమీ ఎంపికలకు రాష్ట్రవ్యాప్తంగా 250 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. అకాడమీలో 20 మంది క్రీడాకారుల కోసం 40 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేశామని, వీరిలో 20 మందిని అకాడమీకి ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపికై న క్రీడాకారులకు శాట్‌జీ ప్రధాన కార్యాలయం నుంచి సెలక్షన్ లేఖలు, ఫోన్ ద్వారా సమాచారం అందజేయడం జరుగుతుందన్నారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులు వచ్చేనెల 1 నుంచి మహబూబ్‌నగర్ కబడ్డీ అకాడమీలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికై న వారు అలాగే సందేహాల నివృత్తి కోసం సెల్ నం.98660 80831ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులు శ్రీనివాస్‌రెడ్డి, మల్లేష్, శాట్‌జీ కబడ్డీ కోచ్ జ్యోతీశ్వర్‌రెడ్డి, ప్రశాంత్, జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


