ఇటీవల కలెక్టర్ అధ్యక్షతన డీఆర్‌డీఏ– ఆరోగ్య శాఖ అధికారులకు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ఒక్కసారి వైద్యాధికారి ఆరోగ్య పరీక్షలు చేసి రక్త నమూనాలు టీ–హబ్‌కు పంపిన తర్వాత రిపోర్ట్స్ వచ్చి ఏదైనా సమస్య ఉన్న మహిళలను మళ్లీ వైద్యాధికారుల దగ్గరకు తీసుకువచ్చే బాధ్యత వీఓలు, డీఆర్‌డీఏ అధికారులదేనని కలెక్టర్ చెప్పారు. థైరాయిడ్, బీపీ, షుగర్, కిడ్నీ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళలకు జనరల్ ఆస్పత్రిలో చికిత్స కోసం రెఫర్ చేస్తున్నాం. ప్రస్తుతం పీహెచ్‌సీలలో స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయి.
– శ్రీనివాసులు, డీఎంహెచ్‌ఓ
మహిళా సంఘాల మహిళలకు చేస్తున్న పరీక్షల్లో ఎక్కువగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. సాధారణంగా ప్రతి మహిళలో 11– 12 మధ్యలో ఉండాలి. కానీ, వీరికి 7–8 మాత్రమే ఉంది. అలాంటి వారికి ఐరన్ మాత్రలు ఇవ్వడం, ఇంజెక్షన్స్ అవసరమైన వారికి పెడుతున్నాం. ఆ తర్వాత 40– 45 ఏళ్ల వారిలో బీపీ, షుగర్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. మేము సమస్య ఉందని గుర్తించిన వారి వివరాలు డీఆర్‌డీఏ అధికారులకు ఇస్తున్నాం. – మమత,
వైద్యాధికారి, పాత పాలమూరు
హెల్త్ ప్రొఫైల్ పైలెట్ ప్రాజెక్టు
లక్ష్యం ఇలా..


