నేషనల్‌ సెమినార్‌కు ఏర్పాట్లు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ సెమినార్‌కు ఏర్పాట్లు ముమ్మరం

Jul 26 2026 3:02 AM | Updated on Jul 26 2026 3:02 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఆగస్టు 7, 8 తేదీలలో షాద్‌నగర్‌లో నిర్వహించే నేషనల్‌ సెమినార్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో అడ్మినిష్ట్రేషన్‌ భవనంలో శనివారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీయూకు రూ.100 కోట్లు కేటాయించి సెమినార్‌ను నిర్వహించేందుకు అవకాశం కల్పించడం పీయూకు గర్వకారణమన్నారు. దేశాన్ని వికసిత్‌ భారత్‌లో భాగంగా పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారని, వివిధ యూనివర్సిటీల వైస్‌ఛాన్స్‌లర్‌లు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొంటారని తెలిపారు. సాంకేతికత అభివృద్ధి, పారిశ్రామిక భాగస్వామ్యం, నైపు ణ్యాభివృద్ది, స్టార్టప్‌లు, ఉపాధి అవకాశాలు, పర్యా వరణ పరిరక్షణ వంటి అంశాలు ఇందులో భాగంగా సెమినార్‌లో చర్చ జరుగుతుందన్నారు. పీయూ లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ పరిశ్రమలు, జాతీయ స్థాయి సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకుంటామని, ఇంటర్న్‌షిప్‌, పరిశోధన, ప్రాజెక్టులు నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పీయూ ఖ్యాతిని, జాతీయ స్థాయిలో పెంచడమే కాకుండా, రాష్ట్రంలో ఉన్నత విద్య పరిశోధన, ఆవిష్కరణలను ప్రతిబింబించే విధంగా సెమినార్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, కన్వీనర్‌లు ప్రవీణ, నూర్జహన్‌, రవికుమార్‌ పాల్గొన్నారు.

అధ్యాపకులకు అభినందన

పీయూ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు చంద్రకిరణ్‌, రామరాజు, పీహెచ్‌డీ స్కాలర్‌ శ్రీనివాస్‌ సంయుక్తంగా చేపట్టిన పరిశోధనల ఫలితంగా నీటిలో రసాయన ఆక్సికరణ చర్యలు జరిపే ఆర్సీకరణ కారకాలను రూపొందించారు. ఈ కారకాలను పునర్వినియోగం చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్‌ పబ్లికేషన్‌ లభించింది. ఈ మేరకు పీయూ వీసీ శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు వారిని అభినందించారు. భవిష్యత్‌లో ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, మెడిసిన్‌ కెమిస్ట్రీలో ఔషధాలు తక్కువ వ్యయంతో తయారు చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల

నుంచి హాజరుకానున్న వీసీ, అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement