ఉత్సాహంగా కబడ్డీ, వాలీబాల్‌ అకాడమీ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా కబడ్డీ, వాలీబాల్‌ అకాడమీ ఎంపికలు

Jul 26 2026 3:02 AM | Updated on Jul 26 2026 3:02 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాట్‌) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న కబడ్డీ, వాలీబాల్‌ అకాడమీ ప్రవేశాల కోసం రెండు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి బాల, బాలికల సెలక్షన్‌ ట్రయల్స్‌ శనివారం ప్రారంభమయ్యాయి. కబడ్డీ అకాడమీకి సంబంధించి బాలుర, వాలీబాల్‌ అకాడమీకి బాల, బాలికల ఎంపికలు జరిగాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కబడ్డీకి దాదాపు 250 మంది బాలురు, వాలీబాల్‌లో బాలురు 80 మంది, బాలికలు 40 మంది హాజరయ్యారు.

వివిధ ఫిజికల్‌ అంశాల్లో పరీక్షలు

కబడ్డీకి సంబంధించి క్రీడాకారులకు వివిధ అంశాలో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ అంశాల్లో పరీక్షలు నిర్వహించారు. స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌, 60గీ10 మీటర్ల షటిల్‌ రన్‌, ఫ్లెక్సిబిలిటీ, 800మీ, 30మీ, సెట్‌ అప్స్‌, పుష్‌ అప్స్‌, స్కిల్‌ టెస్ట్‌లో ఫుట్‌ వర్క్‌, హ్యాండ్‌ టచ్‌, టో టచ్‌, ఆంకిల్‌ హోల్డ్‌, తిగ్‌ హోల్డ్‌, బ్లాకింగ్‌ అంశాల్లో పరీక్షించి అనంతరం మ్యాట్‌పై కబడ్డీ ఆడిపించారు. వాలీబాల్‌కు సంబంధించి ఎత్తు, బరువు, వన్‌ హ్యాండ్‌ టచ్‌, మ్యాగ్జిమమ్‌ టచ్‌, 20మీటర్ల స్టాండింగ్‌, జంప్‌, మెడిసినల్‌ బాల్‌త్రో, ఆగ్జిలిటీ టెస్ట్‌ అంశాల్లో పరీక్షించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌ యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ సురేందర్‌రెడ్డి పాల్గొని క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు అకాడమీల ఎంపికలకు డిప్యూటీ డైరెక్టర్‌ రవీందర్‌ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అంతర్జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు వెంకటనారాయణ, శాట్‌ కోచ్‌ రుషేందర్‌, సీనియర్‌ వాలీబాల్‌ కోచ్‌ అక్బర్‌అలీ, వీరారెడ్డి, ప్రముఖ కబడ్డీ కోచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు మల్లేష్‌, జిల్లా యువజన, క్రీడల అధికారి రాజశేఖర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌, అంతర్జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు వెంకటనారాయణ, జిల్లా వాలీబాల్‌ సంఘం కార్యదర్శి హనీఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement