● నేడు, రేపు రాష్ట్రస్థాయి బాలుర సెలక్షన్స్
● తెలంగాణలోనే ఏకై క కబడ్డీ అకాడమీ
● పాలమూరు మెయిన్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు నగరంలోని మెయిన్ స్టేడియం కబడ్డీ అకాడమీలో ప్రవేశాల కోసం శనివారం, ఆదివారం బాలుర ఎంపికలు జరగనున్నాయి. ఎంపికలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. గత నెలలో అండర్–16 బాలుర కబడ్డీ అకాడమీ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణలోనే మొదటి కబడ్డీ అకాడమీ పాలమూరు నగరంలో ఏర్పాటు కావడం విశేషం. 20 మంది బాలుర సామర్థ్యంతో కబడ్డీ అకాడమీని ఏర్పాటు చేశారు.
సర్టిఫికెట్లతో హాజరుకండి..
మెయిన్ స్టేడియంలోని వాలీబాల్ అకాడమీలో రాష్ట్రస్థాయి సెలక్షన్స్ నిర్వహించనుండగా జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా డీవైఎస్‌ఓ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏదైనా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం ఉన్నట్లయితే సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని, వారికి ఎంపికలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. అకాడమీలో ప్రవేశాల కోసం అర్హులైన క్రీడాకారులు నేరుగా సంబంధిత ధ్రువపత్రాలు (ఒరిజనల్, జిరాక్స్)తో ఉదయం 7.30 గంటలకు మెయిన్ స్టేడియంలో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాల కోసం డీవైఎస్‌ఓ సెల్ నం.98660 80831, కబడ్డీ నామిని సెలక్షన్ కురుమూర్తిగౌడ్ సెల్ నం.97049 34663, వాలీబాల్ కోచ్‌లు అబ్దుల్ రహెమాన్‌ఖాన్ సెల్ నం.97041 50321, పర్వేజ్‌పాష సెల్ నం.77805 82604లను సంప్రదించాలని సూచించారు. అకాడమీకి ఎంపికై న క్రీడాకారులకు ఉచిత శిక్షణ, భోజన, వసతి సదుపాయం ఉంటుందన్నారు. జిల్లాలోని ఆసక్తిగల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అర్హతలు ఇవీ..
అకాడమీలో ప్రవేశాల కోసం 30.06.2010 నుంచి 01.07.2012 మధ్య జన్మించి 14–16 ఏళ్లలోపు బాల, బాలికలు ఉండాలి. వాలీబాల్‌కు బాలుర ఎత్తు 182 సెం.మీ., బాలికల ఎత్తు 166 సెం.మీ., పైబడి ఉండాలి.
తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు
ప్రస్తుతం చదువుతున్న స్కూల్ లేదా కళాశాల నుంచి స్టడీ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం (సంబంధిత అధికారులు తహసీల్దార్/ పంచాయతీ/ మున్సిపాలిటీ నుంచి జారీ చేయబడింది.) పది పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతోపాటు ఆధార్ కార్డు /రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకురావాలి.


