మహిళలకు జీవనోపాధి..
సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో మహిళలు జీవనోపాధి పొందుతారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే సోలార్ కోసం గ్రామంలోని బీడు భూమి నాలుగు ఎకరాలను అధికారులు గుర్తించారు. దీనిపై అధికారులే శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా చొరవ చూపిస్తారు. మహిళా సంఘాల్లో ఉన్న వారందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. – స్వాతి, అధ్యక్షురాలు,
జిల్లా మహిళా సమాఖ్య
స్థలాలు గుర్తించాం..
మహిళలు అన్నిరంగాల్లో రాణించేలా ప్రభు త్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్య లు తీసుకుంటున్నాం. ఇందుకోసం దేవరకద్ర, బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాం. మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి పొందే విధంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం.
– నర్సింహులు, డీఆర్‌డీఓ
●


