సైబర్‌ మోసం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసం

Dec 28 2025 8:42 AM | Updated on Dec 28 2025 8:42 AM

సైబర్

సైబర్‌ మోసం

● రూ.7.6లక్షలు పోగొట్టుకున్న మహిళ

తెలకపల్లి: సైబర్‌ వలలో చిక్కి ఓ మహిళ డబ్బులు పోగొట్టుకుంది. ఎస్‌ఐ నరేశ్‌ వివరాల మేరకు.. తెలకపల్లికి చెందిన బాషమోని శ్రీజ శనివారం ఇన్‌స్ట్రాగాంలో రీల్‌ చూస్తుండగా.. రెస్టారెంట్లకు రేటింగ్‌ ఇస్తే డబ్బులు వస్తాయనే యాడ్‌ వచ్చింది. దానిపై ఆమె క్లిక్‌ చేసి.. రెస్టారెంట్లకు రేటింగ్‌ ఇచ్చింది. ఆ తర్వాత డబ్బుల కోసం ట్రాన్సాక్షన్‌ ఫీజు పంపించాలని సైబర్‌ నేరగాళ్లు నమ్మబలకడంతో ఆమె రూ. 7,68,961 పంపించింది. అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి.. డయల్‌ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేసింది. సైబర్‌ మోసంపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

వ్యక్తిపై వరాహం దాడి.. తీవ్రగాయాలు

కొత్తకోట రూరల్‌: వ్యక్తిపై వరాహం దాడి చేసి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తిజిల్లా కొత్త కోట మండలంలో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పామాపురం గ్రామంలో ఓ తల్లిపంది గ్రామానికి చెందిన తప్పెట బందెన్న అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతడి రెండు చేతులకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వరాహాన్ని భయపెట్టడంతో బందెన్నను వదిలి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇలాంటి ఘటనలు కాకుండా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పందులను, కుక్కలను శివారు ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఉరేసుకుని

యువకుడి ఆత్మహత్య

అమరచింత: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది యువకుడు చెట్టుకు ఉరేసుకొని మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లా అమ రచింత మండ లం కొంకనోనిపల్లి గ్రామంలో చో టు చేసుకుంది. ఎస్సై స్వాతి తెలిపిన వివరాల ప్ర కారం.. కొంకనోనిపల్లి గ్రామానికి చెందిన విజయ్‌(24) తన ఆర్థిక పరిస్థితి బాగాలేక, తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో వైద్యం చేయించలేక మనస్తాపం చెంది శనివారం తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ

మాజీ సైనికుడి మృతి

మాగనూర్‌: మండలంలో ని కొత్తపల్లికి చెందిన మా జీ సైనికుడు సంజీ వ్‌ (45) చికిత్స పొందు తూ శనివారం ఉద యం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకా రం.. సంజీవ్‌ ఇండియన్‌ ఆర్మీలో బీఎస్‌ఎఫ్‌తోపాటు ఎన్‌ఎస్‌జీ బ్లాక్‌ కా మాండోలో విధులు నిర్వహించారు. వ్యక్తిగత కారణాలతో 2022లో వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకుని గ్రామంలోనే ఉంటున్నాడు. వారం కిందట సొంత పనుల నిమిత్తం మక్తల్‌ కు వెళ్లి తిరిగి గ్రామానికి బైక్‌పై వస్తుండగా తిర్మలాపురం గేట్‌ వద్ద బూడిద టిప్పర్‌ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌ లోని ఓప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.రెండురోజుల కింద ట మంత్రి వాకిటి శ్రీహరి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి అక్కడున్న డాక్టర్లకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.సంజీవ్‌కు భార్య మహేశ్వరి, ఇద్దరు కూమారులు, కూతురు ఉన్నారు. సంజీవ్‌ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.

సైబర్‌ మోసం 
1
1/1

సైబర్‌ మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement