జర్నలిస్టుల మధ్య వ్యత్యాసం చూపొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): డెస్క్ జర్నలిస్టులకు శాపంగా మారిన జీఓ 252ను వెంటనే రద్దు చేయాలని డెస్క్ జర్నలిస్టు సీనియర్ నాయకులు తిరుపతయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివా రం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన పత్రికల్లో ఉంటూ అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించి చీక ట్లో ఇళ్లకు వెళ్తుంటామని, ఈ క్రమంలో పోలీసుల తనిఖీలతో అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్ కార్డు ఉంటే వాటిని చూయించి సురక్షితంగా బయట పడేందుకు అవకాశం ఉంటుందన్నారు. విలేకరులు, డెస్క్ జర్నలిస్టుల మధ్య వ్యత్యాసం చూపకుండా అందరికీ ఒకేరకమైన అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను తగ్గించకుండా గతంలో మాదిరి గా డెస్క్ జర్నలిస్టులకు సరిపడా కార్డులు ఇచ్చి అందరికీ బస్సు పాసులు కేటాయించాలని కోరారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం కోసం హెల్త్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల పథ కం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అక్రిడిటేష న్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు చోటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రిటైర్డ్ జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రతినెలా రూ. 25 వేల పింఛన్ ఇవ్వాలని వర్తింపజేయాలని పేర్కొ న్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డెస్క్ జర్నలిస్టులు సాయికుమార్, రవి, శ్రీనుయాదవ్, మాణిక్‌రావు, రవికుమార్, నవీన్, శివకుమార్, రాఘవశాస్త్రి, రామస్వామి, జాఫర్, టీయూడబ్ల్యూజే నాయకులు శివకుమార్ పాల్గొన్నారు.


