టీ–20 లీగ్‌లో మహబూబ్‌నగర్ విజయం
● క్వార్టర్ ఫైనల్‌కు చేరిన జిల్లా జట్టు
● ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచిన
క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్‌లోని గ్రీన్‌వ్యూ క్రికెట్ గ్రౌండ్–3లో శనివారం జరిగిన హెచ్‌సీఏ బి–డివిజన్ టీ–20 లీగ్ కం నాకౌట్ టోర్నమెంట్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మహబూబ్‌నగర్ జిల్లా జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో ఎ.శ్రీకాంత్ 22 బంతుల్లో 3 ఫోర్లతో 30, అబ్దుల్ రాఫే 20 పరుగులు చేశారు. ఖల్సా బౌలర్లు కరణ్ యాదవ్ 2, సన్నపవార్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఖల్సా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. కరణ్‌పట్నాయక్ 36, దీపాంషు 30 పరుగులు చేశారు. మహబూబ్‌నగర్ బౌలర్లు మహ్మద్ షాదాబ్ 3 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2, మహ్మద్ ముఖితుద్దీన్ 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కొండ శ్రీకాంత్, గగన్ చెరో వికెట్ తీశారు. టీ–20 లీగ్‌లో జిల్లా జట్టు మ్యాచ్ గెలుపొందడంపై ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న మ్యాచుల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.


