
విద్యుత్ కార్మికుల పక్షాన పోరాడుతం
● 1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ
● ట్రాన్స్‌కో రీజినల్(ఉమ్మడి జిల్లా) అధ్యక్షుడిగా రఘువీర్‌రెడ్డి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): విద్యుత్ కార్మికుల పక్షాన యూనియన్లు నిరంతరం పోరాటం చేయాలని విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబ అన్నారు. గురువారం స్థానిక యూనియన్ కార్యాయలంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా వారి తరఫున పోరాటం చేయాలన్నారు. కార్మికుల హక్కులను కాపాడిన రోజే యూనియన్లకు మనుగడ ఉంటుందన్నారు. అనంతరం ట్రాన్స్‌కో రిజినల్(ఉమ్మడి జిల్లా)కమిటీని ఎన్నుకున్నారు. ట్రాన్స్‌కో రిజినల్(ఉమ్మడి జిల్లా) జిల్లా అధ్యక్షుడిగా రఘువీర్‌రెడ్డి, రీజినల్ సెక్రటరీగా రాఘవేందర్‌గౌడ్, రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జితేందర్‌రెడ్డి, రీజనల్ అడిషనల్ సెక్రటరీగా స్వామిగౌడ్, రీజినల్ ఉపాధ్యక్షులుగా స్వాతి, శివకుమార్, రీజినల్ ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సీహెచ్ చెన్నయ్య, ఎండీ ఇక్బాల్, రీజినల్ అసిస్టెంట్ సెక్రెటరీగా సత్యనారాయణ, రీజినల్ ట్రెజరర్‌గా ఎండీ మక్సూద్‌అలీ ఎన్నికయ్యారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్‌శాఖ ఉద్యోగులు, కార్మికులకు తాము అండగా ఉంటామని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ జిల్లా అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు.