
కోర్టుకు హాజరైన తేజేశ్వర్ హత్య కేసు నిందితులు
గద్వాల క్రైం: జూన్17న గద్వాల పట్టణంలోని గంటవీధికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ సుపారీ గ్యాంగ్ చేతిలో దారుణహత్యకు గురైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం విధితమే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జైల్‌లో రిమాండ్‌లో ఉన్న నిందితులు ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ3 కుమ్మరి నగేష్, ఏ4 చాకలి పరశురాముడు, ఏ5 చాకలి రాజు, ఏ6 ఎ.మోహన్, ఏ7 తిరుపతయ్య (తిరుమలరావు తండ్రి), ఏ8 సుజాతలను గద్వాల జూనియర్ సివిల్ కోర్టు నాయ్యమూర్తి ఉదయ్‌నాయక్ ఎదుట పోలీసులు గురువారం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను నియమించుకున్నారా.. అని నిందితులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం నిందితులకు మరో 14 రోజుల పాటు రిమాండ్‌కు ఆదేశాలు జారీ చేయగా.. పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఏ7 తిరుపతయ్య మాత్రం బెయిల్ మీద ఉన్నాడు.