
ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి
లింగాల: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని వల్లభాపూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ తెలిపిన వివరాలిలా.. వల్లభాపూర్‌కు చెందిన పిట్టల లక్ష్మయ్య(65) ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. అయితే, గురువారం గ్రామ శివారులోని జంబులమ్మ కుంటలో లక్ష్మయ్య మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి పరిశీలించారు. చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతిచెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య రాములమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉరేసుకొని
వ్యక్తి ఆత్మహత్య
నవాబుపేట: కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన చెంచు రాజు(34) కొంతకాలంగా ఎలాంటి పనులు చేయకుండా మద్యం తాగి తిరుగుతుండేవాడు. భార్య కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యేవి. ఈ క్రమంలో మనస్థాపం చెందిన రాజు బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు వేసుకొని ఇంటిపైకప్పుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలిపనికి వెళ్లిన భార్య లక్ష్మమ్మ ఇంటికొచ్చి చూడగా వేలాడుతున్న భర్త మృతదేహం కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
మానవపాడు: ీఫట్స్ ట్యాబ్టెట్స్ ఎక్కువగా మింగి వ్యక్తి సృహ కోల్పోయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందిన ఘటన మండలంలోని చెన్నిపాడులో చోటచేసుకుంది. ఎస్‌ఐ చంద్రకాంత్ కథనం ప్రకారం.. మానవపాడు మండలంలోని చెన్నిపాడుకు చెందిన ఉల్చా శ్రీరాములు(50) పెళ్లి అయిన నాటినుంచి ఫిట్స్ వస్తుండేవి. రెండేళ్లుగా మతిస్థిమితం లేకుండా ఉన్నాడు. అందుకు కర్నూల్ ప్రభుత్వ ఆరోగ్యకేంద్రంలో సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స పొందుతూ మందులు వాడుతున్నాడు. ఈనెల 20వ తేదీన ఉదయం భార్య కంగాలమ్మ కూలి పనులకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూలేని సమయంలో శ్రీరాములు ఫిట్స్ వాడే ట్యాబ్లెట్లు అధిక మోతాదులో తీసుకోవడంతో స్రృహ కోల్పోయాడు. భార్య సాయంత్రం పనినుంచి ఇంటికి వచ్చి చూసి శ్రీరాములును కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స నుంచి కోలుకోలేక గురువారం రాత్రి మృతిచెందాడు. భార్య కంగాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
వనపర్తి రూరల్: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన వనపర్తి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రాయిగడ్డ కాలనీకి చెందిన జానంపేట రమేష్ (36) బుధవారం రాత్రి పట్టణంలోని నల్ల చెరువు వద్ద కావలి ఉండడానికి వెళ్లాడు. గురువారం ఉదయం రమేష్ చెరువు అలుగు వద్ద బురదలో పడి ఉండడాన్ని చూసిన తోటి కావలి వారు వెంటనే ప్రభుత్వ ఆసుపతికి తీసుకెళ్లారు. డాక్డర్ పరిక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య జానంపేట రేణుక చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్
గద్వాల క్రైం: ఈ నెల 18న పౌరహక్కుల నేత పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘ టనపై మల్దకల్ పోలీసులు గురువారం ఉద యం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ మొగిలయ్య కథనం మే రకు.. మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామా నికి చెందిన పౌరహక్కుల నేత మహేష్‌కు అదే గ్రామానికి చెందిన బోయనీలి బీసన్న, బో యనీలి పాండులకు పలు విషయాలపై గొ డవలు ఉన్నాయి. ఈ క్రమంలో గత నాలు గు రోజుల క్రితం గ్రామంలో టీ స్టాల్ వద్ద మహేష్ టీ తాగుతుండగా ఇద్దరు వ్యక్తులు పాత కక్షలు మనస్సులో పెట్టుకుని కత్తితో దాడి చేశారు. ఈ సంఘటనపై అదేరోజు మ ల్దకల్ పోలీసుస్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, హత్యాయ త్నం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను గురువారం ఉద యం అరెస్టు చేసి విచారణ చేపట్టడంతో నే రం అంగీకరించారు. నిందితులను గద్వాల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.