
లైన్ల్లో నిలబడ్డా ఇవ్వట్లేదు..
రైతుకు అవసరం లేకున్నా అనవసరంగా ఎరువులు, పురుగు మందులను అంటగడుతున్నారు. ఆ డబ్బులతో ఇంకో యూరియా బస్తా కొనుక్కోవచ్చు. సొసైటీ నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చేసేదేం లేక వారు చెప్పినట్టు కొంటున్నం. గతంలో కావాల్సినన్ని యూరియా బస్తాలను తీసుకెళ్లటోళ్లం. ఇప్పుడు కుటుంబం మొత్తం వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తెల్లవారక ముందే లైన్‌లో ఉంటున్నా.. సరిపోను యూరి యా ఇవ్వట్లేదు. ఒకవైపు వ్యవసాయ పనులు ఆగుతుండగా, మరోవైపు పంటలు దెబ్బతింటున్నాయి.
– గొల్ల మల్లయ్య, రైతు, ధర్మాపూర్
దొరకట్లేదు..
నాకు మూడెకరాల భూమి ఉంది. 20 రోజుల కిందట నాట్లు వేశాను. నాటేసిన 15 రోజుల్లోపే పొలానికి యూరియా వేస్తేనే పంట దిగుబడి వస్తుంది. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నా.. దొరకటల్లేదు. అధికారులు స్పందించి రైతులకు సకాలంలో సరిపడా యూరియా ఇవ్వాలి.
– వెంకటయ్య, రైతు, ఎదిర
పది రోజులుగా తిరుగుతున్నా..
పది రోజులుగా యూరియా కోసం జిల్లా సహకార విక్రయ కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాను. ఈ రోజూ కూడా పనులు మానుకుని విక్రయ కేంద్రం వద్దకు ఉదయం 5 గంటలకే వచ్చాను. ఆధార్ కార్డు మీద రెండు బస్తాలే ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులతో ఆడుకుంటుంది. పంటలకు సకాలంలో ఎరువులు వేయకపోతే దిగుబడి రాదు. గత పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఎరువుల కొరత లేదు. – చెన్నారెడ్డి, రైతు, గుడ్డి మల్కాపూర్
నెలాఖరులో 5వేల మెట్రిక్ టన్నులు
జిల్లాలో ప్రస్తుతం 894 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా.. ఈనెలాఖరుకు మరో 5,318 మెట్రిక్ టన్ను లు వస్తుంది. యూరియా నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తాం. ఆగస్టు మాసానికి 9,036 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఇప్పటి వరకు 3,718 మెట్రిక్ రైతులకు సరఫరా చేశాం. సన్న, చిన్నకారు రైతులకు ఎక్కువగా సరఫరా చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. అంతా ఒకేసారి కావాలంటే సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డీలర్లలో ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలించినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. నానో యూరియాపై అవగాహన కల్పిస్తున్నాం.
– బి.వెంకటేష్, డీఏఓ

లైన్ల్లో నిలబడ్డా ఇవ్వట్లేదు..

లైన్ల్లో నిలబడ్డా ఇవ్వట్లేదు..

లైన్ల్లో నిలబడ్డా ఇవ్వట్లేదు..