
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా రంగా ఆజ్మీరా
పాలమూరు: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా జనరల్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ రంగా ఆజ్మీరా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. నారాయణపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్‌కుమార్‌సింగ్ కొత్త సూపరింటెండెంట్‌కు బాధ్యతలు అప్పగించారు. సంపత్‌కుమార్ నారాయణపేటకు బదిలీ అయిన తర్వాత అనస్తీషియా హెచ్‌ఓడీ డాక్టర్ మాధవి నెల రోజుల పాటు తాత్కాలిక సూపరింటెండెంట్‌గా కొనసాగారు. ప్రస్తుతం బాధ్యతలు తీసుకున్న డాక్టర్ రంగా ఆజ్మీరా 1995 నుంచి 2000 వరకు రాజాపూర్ పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన చేశారు. పీజీ పూర్తి చేసి గాంధీ, ఉస్మానియాలో పనిచేశారు. ప్రొఫెసర్‌గా పదోన్నతి పొంది బదిలీపై మహబూబ్‌నగర్ జనరల్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీగా వచ్చారు. సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రికి కొత్తగా లాప్‌రోస్కోపీ మిషన్ తీసుకొచ్చి సర్జరీలు చేస్తామన్నారు.ప్రైవేట్‌లో ల్యాప్‌రోస్కోపీ అయితే రూ.వేలు ఖర్చు అవుతాయని అలాంటి సర్జరీలు ఉచితంగా రోగులకు అందిస్తామన్నారు. అదే కోత ద్వారా అయితే రోగికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఆధునిక పద్ధతుల్లో సర్జరీలు చేయడానికి పరికరాలు చాలా అవసరమన్నారు. ఆస్పత్రి పాత భవనం కావడం వల్ల ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ ఇతర చోట్ల వర్షం లీకేజీ అవుతుందని దానిపై దృష్టి పెట్టడంతో పాటు ఆస్పత్రిలో పేషెంట్ కేర్ బాగుందని, సర్జరీలు అవుతున్నాయని ఇంకా పెంచే విధంగా పని చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ సూచనలు, సహకారంతో రోగులకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా పని చేస్తానని తెలిపారు. కాగా కొత్త సూపరింటెండెంట్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ రంగా ఆజ్మీరాకు ఆస్పత్రిలో పనిచేసే అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, వైద్యులు, సిబ్బంది శాలువలు కప్పి, పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.