అథ్లెట్లకు తిప్పలు.. | - | Sakshi
Sakshi News home page

అథ్లెట్లకు తిప్పలు..

Aug 21 2025 9:12 AM | Updated on Aug 21 2025 9:12 AM

అథ్లె

అథ్లెట్లకు తిప్పలు..

సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలి ప్రతిపాదనలు పంపాం క్రీడాకారులకు మేలు స్టేడియం పరిశీలించిన కేంద్ర సభ్యులు

ఔత్సాహిక క్రీడాకారులకు వరం

ఉమ్మడి జిల్లాలో అందుబాటులో లేని సింథటిక్‌ ట్రాక్‌లు

మెయిన్‌ స్టేడియంలో ఇప్పటికే అనేక క్రీడా సౌకర్యాలు ఉన్నాయి. సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సింథటిక్‌ ట్రాక్‌పై క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.

– జి.శరత్‌చంద్ర, అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి, మహబూబ్‌నగర్‌

జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ కోసం రూ.10 కోట్లతో స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో ట్రాక్‌ ఏర్పాటుకు సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్‌ ట్రాక్‌లో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయి.

– ఎస్‌.శ్రీనివాస్‌, డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్‌

సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ ఏర్పాటు వల్ల క్రీడాకారులకు మెరుగైన ప్రాక్టీస్‌ లభిస్తుంది. దీంతో జిల్లా క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దొచ్చు. సింథటిక్‌ ట్రాక్‌ కోసం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్తాం.

– రమణ, జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి,

నారాయణపేట

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జిల్లా నుంచి పలు క్రీడల్లో క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఐదు చోట్ల ఖేలో ఇండియా సెంటర్లు, మహబూబ్‌నగర్‌లో వాలీబాల్‌ అకాడమీ, వనపర్తి పట్టణంలో హాకీ అకాడమీ ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన క్రీడాకారులు అథ్లెటిక్స్‌లో పతకాలు సాధిస్తూ సత్తాచాటుతున్నారు. కానీ ఈ జిల్లాల్లో సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌లు లేకపోవడంతో చాలా మంది క్రీడాకారులు మట్టి గ్రౌండ్‌లోనే సాధన చేస్తున్నారు.

జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్‌ ట్రాక్‌ ప్రతిపాదనలకు సంబంధించి 2021 అక్టోబర్‌ 22న ఖేలో ఇండియా కేంద్ర పరిశీలన కమిటీ సభ్యులు పరిశీలించారు. స్టేడియం అంతా తిరిగి సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై అంచనా వేశారు. అదే విధంగా మెయిన్‌ స్టేడియంలో 2023 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి పనులతో పాటు రూ.8కోట్ల నిధులతో చేపట్టనున్న సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అయితే ఇంత వరకు సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుపై ముందడుగు పడలేదు. దీంతో స్టేడియంలో ఉన్న మట్టి ట్రాక్‌పై అథ్లెట్లు ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

ఐదు జిల్లాల్లో వందలాది

మంది అథ్లెట్లు

ఉమ్మడి జిల్లాలో ఎక్కడా ఊసే లేదు

మెరుగైన క్రీడా శిక్షణకు ఇబ్బందులు

ట్రాక్‌లు ఏర్పాటు చేయాలంటున్న క్రీడాకారులు

సింథటిక్‌ ట్రాక్‌లు ఏర్పాటు అయితే ఔత్సాహిక క్రీడాకారులకు ఎన్నో మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. పరుగు పందెం పోటీల్లో క్రీడాకారుల్లో సరైన టైమింగ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాక్‌లపై నీళ్లు నిలిచే అవకాశం ఉండదు కాబట్టి వర్షాకాలంలో సైతం ఏ ఇబ్బంది లేకుండా అథ్లెట్లు సాధన చేసుకోవచ్చు. సింథటిక్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ల ఏర్పాటుతో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు జరిగే అవకాశం ఉంటుంది.

అథ్లెట్లకు తిప్పలు.. 1
1/3

అథ్లెట్లకు తిప్పలు..

అథ్లెట్లకు తిప్పలు.. 2
2/3

అథ్లెట్లకు తిప్పలు..

అథ్లెట్లకు తిప్పలు.. 3
3/3

అథ్లెట్లకు తిప్పలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement