
‘కురుమూర్తి’లో పూర్తయిన బహిరంగ వేలం
చిన్నచింతకుంట: అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుందామని ఆలయ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వరెడ్డి అన్నారు. 2025–26 ఉత్సవాలకు సంబంధించి లడ్డు ప్రసాదం, కొబ్బరికాయలు, లైటింగ్, తలనీలాలు, కొబ్బరి చిప్పలు, పూజ సామగ్రి తదితర వాటి బహిరంగ వేగం బుధవారం ఆలయ ఆవరణలో నిర్వహించారు. లడ్డు ప్రసాదంను చిన్నకడుమూర్‌కు చెందిన వెంకట్రాంరెడ్డి రూ.46 లక్షలకు, తలనీలాలను మహబుబ్‌నగర్‌కు చెందిన రామన్‌గౌడ్ రూ.32 లక్షలకు, విద్యుత్ లైటింగ్ అమ్మాపురం గ్రామానికి చెందిన రవితేజ రూ.13.33 లక్షలకు, రంగుల రాట్నం హైదరాబాద్‌కు చెందిన జ్ఞానేశ్వర్ రూ.34.05 లక్షలకు కొబ్బరి చిప్పలు అల్లీపురం గ్రామానికి చెందిన ఆంజనేయులు రూ.4,06,200కు దక్కించుకున్నట్లు వారు వివరించారు. పూజా సామగ్రి, కొబ్బరికాయల విక్రయానికి సరైన పాట రానందున వాయిదా వేసినట్లు చెప్పారు. ఉత్సవాలు అక్టోబర్‌లో జరగనున్నాయని.. లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నందున ఎలాంటి ఇబ్బదులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాటదారులు భక్తులకు నాణ్యమైన వాటిని విక్రయించాలని.. లేకుంటే తగిన చర్యలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కతలప్ప, ఆలయ కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, భాస్కరాచారి, కమలాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.46 లక్షలు పలికిన లడ్డు ప్రసాదం