
మీ కొడుకు డ్రగ్ కేసులో దొరికాడు
మద్దూరు: ‘హలో.. మై డీఎస్‌పీ బాత్ కర్‌హ హు అప్ కా బేటా డ్రగ్స్ కేస్ మే మిల్ గయా. ఛోడ్‌దేనా బోలేతో థీస్ హజార్ అర్జెంట్ ఫోపే కరో.. నైతో కేసు హోయాతో 10 సాల్ సజా గిర్‌తా, ఫైన్‌బీ గిర్‌తా.. అర్జెంట్ ఫోన్ పే కరో..(హలో నేను డీఎస్‌పీని.. నీ కొడుకు డ్రగ్ కేసులో పట్టుబడ్డాడు. అతడిని విడిచి పెట్టాలంటే వెంటనే రూ.30 వేలు ఫోన్ పే చేయండి. లేదంటే కేసు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా పడుతుంది) అంటూ వచ్చిన ఫోన్‌కాల్‌తో ఓ తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే మద్దూరు పట్టణానికి చెందిన నాగేందర్ పిండి గిర్ని నడిపిస్తున్నాడు. ఇతని పెద్ద కొడుకు విశాల్ షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు 923707509858 నెంబర్ నుంచి వాట్సప్ కాల్ వచ్చింది. దీంతో ఆయన భార్య భాగ్యమ్మ ఫోన్ ఎత్తింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. ‘నీ కొడుకు మరో 4 గురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. కేసు చేస్తే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించడం జరుగుతుంది. మీ కుటుంబం ఎలాంటి కేసులో లేవు, ఉన్నతంగా జీవించే కుటుంబలా ఉంది. వెంటనే రూ.30 వేలు ఫోన్ పే చేస్తే కేసు నుంచి తప్పిస్తాం’అని తెలిపారు. ఆమె వెంటనే భర్త నాగేందర్‌కు ఫోన్ ఇచ్చింది. అవతలివైపు నుంచి దూరంగా పోలీసులు కొడుకును కొట్టుతున్న శబ్దాలను వినపడడంతో.. ‘మా ఫోన్‌లో అంత డబ్బు లేదు.. మీరు ఎక్కడ ఉన్నారో చెబితో డబ్బులతో అక్కడి వస్తాం’ అని భయపడుతూ చెప్పాడు. దీంతో అవతలి వ్యక్తి దంపతులను మరింత బెదిరించి, ఫోన్ కట్ చేశారు. విషయం చుట్టపక్కల వారికి తెలియడంతో వారు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఫోన్ కట్ చేయడంతో మళ్లీ ఫోన్ చేశాడు. దాదాపు 10 నిమిషాల పాటు వీళ్లను ఫోన్‌లో బెదిరించాడు. ఈ క్రమంలో ఇతర ఫోన్ నుంచి అతని కొడుకు ఫోన్ చేసి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. నాకు ఏమీ కాలేదని కొడుకు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలుపగా నంబర్లను వాటప్స్ కాల్స్ వస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి విషయం తెలియజేయాలని సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు.
రూ.30 వేలు ఫోన్‌పే చేస్తే వదిలేస్తాం
సైబర్ నేరగాళ్ల బెదిరింపులు

మీ కొడుకు డ్రగ్ కేసులో దొరికాడు