
ఊడ్చడానికి ఎవరూ రారు
మా ప్రాంతంలో ఊడ్చడానికి నెలల తరబడి ఎవరూ రావడం లేదు. చుట్టుపక్కల అంతా అపరిశుభ్ర వాతావరణం అలుముకుంది. మోరీలను శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలకు నిలయంగా మారాయి. ఇంట్లోని చిన్నపిల్లలను ఆడుకోవడానికి ఆరు బయటకు పంపించాలంటేనే భయంగా ఉంది. ఇప్పటికే మా కాలనీకి చెందిన ఇద్దరు డెంగీ బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. – మేఘన, గృహిణి,
క్రిస్టియన్‌కాలనీ, సుభాష్‌నగర్
వరద కాల్వతో ఎన్నో ఇబ్బందులు
మా స్కూల్ వెనుకనే పెద్దచెరువుకు వెళ్లే వరద కాల్వ ఉంది. అందులో చెత్తాచెదారం, మురుగు పారుతుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. పక్కనే ఉన్న ఓపెన్ ప్లాట్‌లో చుట్టుపక్కలవారు వచ్చి చెత్తాచెదారం వేసి పోతున్నారు. ముళ్లకంప, పొదలతో నిండిపోయింది. దీంతో ఇక్కడి మదర్సాలలో చదువుకుంటున్న చిన్నారులకు రోగాలు సోకే ప్రమాదం పొంచి ఉంది. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి.
– మొహమ్మద్ హమీద్, మదర్సా వాచ్‌మన్, పీర్లబాయి, మహబూబ్‌నగర్
చుట్టూ కార్ఖానాలతో కాలుష్యమయం
మా గేరి చుట్టూ వాహనాల మరమ్మతు చేసే కా ర్ఖానాల నుంచి వెలువడే కాలుష్యంతో ఇబ్బందు లు తప్పడం లేదు. వీధి లోపలికి ఎవరూ ఊడ్చ డానికి రావడం లేదు. ఎవరి ఇళ్ల ముందు వారే శుభ్రం చేసుకునే పరిస్థితి తలెత్తింది. మెయిన్ రోడ్డు నుంచి కార్ఖానాలు ఉండే షాపుల వరకు మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఊడ్చిపో తున్నారు. థియేటర్ పక్కన మోరీ వద్ద ఎవరిబడితే వారు మూత్రం చేస్తున్నారు. – యాదగిరి,
ఆటో డ్రైవర్, కొమ్ముగేరి, మహబూబ్‌నగర్
●

ఊడ్చడానికి ఎవరూ రారు

ఊడ్చడానికి ఎవరూ రారు