
అడ్డగోలుగా హాస్టళ్లు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరులో ప్రభు త్వ, ప్రైవేటు విద్యాసంస్థలు విస్తరించడం, ఎడ్యుకేషన్ హబ్‌గా మారడంతో ఉమ్మడి జిల్లా నుంచి పె ద్దసంఖ్యలో విద్యార్థులు ఇక్కడ చదువుకునేందు కు వస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా ప్రభుత్వ వసతి గృహాల్లో సీట్లు ఇవ్వక పోవడంతో వారు ప్రైవేటు హాస్టళ్లను ఆశ్రయిస్తున్నా రు. దీనిని ఆసరాగా చేసుకున్న పలు హాస్టళ్ల నిర్వాహకులు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా రు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారీతిగా ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకేంద్రంలో సుమారు 30 నుంచి 40 వరకు ప్రైవేటు హాస్టళ్లు ఉండగా.. చాలా వాటికి పూర్తిస్థాయిలో అనుమతులు, ఫుడ్‌సేఫ్టీ, శానిటేషన్, ఫైర్‌సేఫ్టీ, ట్రేడ్ లైసెన్స్ వంటివి లేకుండానే అడ్డగోలుగా నిర్వహిస్తున్నారు. కానీ, వీటివైపు ఇటు విద్యా శాఖ గాని, అటు మున్సిపల్ యంత్రాంగం గాని కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కనిపించని భద్రతా చర్యలు
జిల్లాకేంద్రంలో ఎక్కువ సంఖ్యలో బాలికల హాస్ట ల్స్ ఉన్నాయి. వీటిలో చాలా హాస్టల్స్ దగ్గర నిర్వాహకులు సరైన భద్రతా పరమైన చర్యలు తీసుకోవ డం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. కొన్ని బాలిక ల హాస్టళ్ల దగ్గర రాత్రి 10 నుంచి 11 గంటల వరకు యువకులు హల్‌చల్ చేస్తారని, ఆ సమయంలో కూడా బాలికలు బయటికి వస్తున్నారని తెలుస్తుంది. కొంతమంది బాలికలు రాత్రి ఎక్కువ సమయం బయటికి వచ్చినా పట్టించుకోకుండా తిరిగి హాస్టల్స్ లోకి రానిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో యాజమాన్యాలు కేవలం ఫీజుల కోసం మాత్రమే హాస్టల్స్ నిర్వహిస్తున్నారని, బాలికల భద్రతను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. దీనికితోడు బాలికల హాస్టల్స్‌లో కేవలం చదువుకునే విద్యార్థినులు మాత్రమే ఉంటున్నారా.. లేక ఇతరులు ఎవరైనా ఉండి వెళ్తున్నారా అనే ప్రశ్న కు సమాధానం ఏ ఒక్కరి వద్ద సరైన సమాధానం లేదు. అలాగే ఎవరైనా ఒకరు హాస్టల్‌లో చేరిన వారం రోజులు ఉండి హాస్టల్ నచ్చక వెళ్లిపోతే నెల రోజులకు సంబంధించిన ఫీజు మొత్తం చెల్లించాలని ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తుంది.
జిల్లాకేంద్రంలో ఇష్టారీతిగా ప్రైవేట్ వసతి గృహాల నిర్వహణ
అనుమతులు లేకుండానే పదుల సంఖ్యలో ఏర్పాటు
రూ.వేలల్లో ఫీజులు.. నాణ్యత లేని భోజనం వడ్డింపు
రాత్రివేళలో మచ్చుకై నా
కనిపించని భద్రతా చర్యలు
అటువైపు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం