
సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో టీజీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను సంఘం గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా, సంఘం నాయకులు పలు తీర్మానాలు చేస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు రేషన్ కార్డులు, సకాలంలో వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా సంఘ భవనం నిర్మించుకునేందుకు స్థలం కేటాయించాలన్నారు. అనంతరం ఆనంద్‌గౌడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి బుచ్చిరెడ్డి, అదనపు కార్యదర్శి కె.సత్యన్నచారి, నాయకులు రహిమాన్‌సోఫి, భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.