దేశ శాంతి కోసం.. సైకిల్‌పై ఏకంగా 17 రాష్ట్రాలా..! వామ్మో..!! | - | Sakshi
Sakshi News home page

దేశ శాంతి కోసం.. సైకిల్‌పై 17 రాష్ట్రాలు చుట్టేశా..!

Aug 8 2023 1:28 AM | Updated on Aug 8 2023 9:56 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: దేశంలో శాంతి నెలకొల్పాలని, ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ ఒక వ్యక్తి 17 రాష్ట్రాలు చుట్టేశాడు. కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లా సింధనూర్‌ పట్టణానికి చెందిన విజయ గోపాలకృష్ణ దేశ శాంతి కోసం 2022 మార్చి 11వ తేదీన సింధనూర్‌లో సైకిల్‌ యాత్ర ప్రారంభించాడు.

నిర్విరామంగా యాత్ర కొనసాగిస్తూ 17 రాష్ట్రాలను చుట్టేసి చివరగా తన సొంత ఊరుకు బయలు దేరాడు. సోమవారం దేవరకద్ర పట్టణానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, యానం, తెలంగాణ మీదుగా తిరిగి కర్ణాటక వెళ్తున్నట్లు తెలిపారు.

ఇప్పటి వరకు 514 రోజులు సైకిల్‌ యాత్రను కొనసాగించినట్లు తెలిపారు. దేశంలో 12 పుణ్య నదులు ఉండగా, 11 పుణ్యనదుల్లో స్నానం చేసి ప్రముఖ దేవాలయాలను సందర్శించుకుని పూజలు చేశానన్నారు. త్వరలో తన సొంత పట్టణానికి చేరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement