సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలం

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

● మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌

కురవి: కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే కందికొండ జాతరలో కనీస సౌకర్యాలను కల్పించలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌ విమర్శించారు. గురువారం కందగిరి పర్వతం మెట్ల వద్ద పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌ కందికొండ గుట్టను ఎక్కి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నట్లు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు గుట్టకు వచ్చే మార్గాలను కలుపుతూ రోడ్ల నిర్మాణాలకు రూ.9.40కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అప్పటి ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ రూ.3.50 కోట్ల నిధులు బీటీ రోడ్డుకు, రూ.1.50 కోట్లు మెట్లకు వెచ్చించినట్లు వివరించారు. సగం పనులు పూర్తయ్యాయని, పెండింగ్‌ పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌ కందికొండను పర్యాటక హబ్‌గా మార్చుతామని, రోప్‌ వే ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారని, కనీసం రోడ్డు వేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌ను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఈ ప్రాంత అభివృద్ధిపై సీఎం నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ సర్పంచ్‌ ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఐలి నరహరి, బోడశ్రీను, బాదె నాగయ్య, బండి మాదవయ్య, గుగులోత్‌ నెహ్రూనాయక్‌, సురేష్‌, ధల్‌సింగ్‌, మెట్టు ఉప్పలయ్య, బయ్య శ్రీను, బొడ్డు రమేశ్‌, ఉపేందర్‌, నరసింహ, ధరావత్‌ వెంకన్న ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement