సంఘటనలు, ఫిర్యాదుల మొదలుకొని కేసు పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకొని పారదర్శక పోలీస్ వ్యవస్థను నడిపించేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన విధానమే డిజిటల్ అవర్. ప్రతీ పోలీస్ స్టేషన్‌లో కేసుల వివరాలను అక్కడ ఉన్న అధికారి రోజు తెలుసుకోవాలి.. పర్యవేక్షించాలి.. ఆన్‌లైన్‌లో నమో దు చేయాలి. ప్రతీరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రెండు గంటల సమయంలో ఈ పని పూర్తి చేయాలి. ఇందులో ప్రధానంగా 13 అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. జీరో ఎఫ్‌ఐర్, కొత్త క్రిమినల్ చట్టాలు, చార్జీషీట్, ఎఫ్‌ఐఆర్, కన్‌జన్షన్, ఈ–సాక్షా, ఈ–సమన్లు, మెగ్లిఫల్స్, పాఫిస్, ఈ–పెట్టీకేసులు, ఈ–చలాన్స్, జియో ట్యాగ్స్, డయల్ 100 కాల్స్ రివ్యూ మొదలైనవి ఉన్నాయి. వీటిని రోజు పరిశీలించి వివరాలను మెసేజ్ ద్వారా పంపుతారు. మరుసటి రోజు ఉదయాన్నే ఈ విషయాలపై చర్చ జరుగుతుంది. దీంతో కేసుల పర్యవేక్షణ పెగుతుంది.
పోలీస్‌లకు డిజిటల్ విద్య..
ప్రతీ మనిషి కొత్తదనంతో ముందుకెళ్తేనే చేస్తున్న వృత్తిలో రాణిస్తారు. పోలీస్ అయినా.. టీచర్ అయినా.. రైతులు అయినా.. ఎవరైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి. అలాగే కొత్తగా వచ్చిన చట్టాలు, ఆన్‌లైన్ విధానం, డిజిటల్ మార్పులపై జిల్లా పోలీస్‌లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రధానంగా 2018, 2020, 2024 బ్యాచ్‌లలో ఎంపికై న కానిస్టేబుళ్లు, ఎస్సైలకు ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించి కొత్త విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం. నేర్చుకున్న విషయాలను ప్రతీ వారం రివ్యూ చేయడం, అర్థం కాని విషయాలను మళ్లీ చెప్పడం వంటి ప్రక్రియ ముందుకు సాగుతోంది. అదే విధంగా ఏఐ పరిజ్ఞానం, మొదలైన విషయాల్లో తర్ఫీదు ఇస్తున్నాం.
కేసుల జాప్యంపై దృష్టి..
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రతీ ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించడం, సత్వర నాయ్యం అందించడే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. ప్రధానంగా కేసుల పెండింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి.. ప్రతీ కేసును వీలైనంత త్వరగా నమోదు చయడం, కేసు స్థాయిని బట్టి సీసీటీఎన్‌ఎస్ ప్రకారం 60 లేదా 90 రోజుల్లో చార్జీషీట్ వేసి కోర్టుకు పంపించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించాం. దీంతో రెండు నెలల క్రితం 1500 కేసులు పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం పెండింగ్ కేసుల సంఖ్య 300కు చేరింది. ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేయాలని చెప్పినా వెనకబడిన వా రిపై ప్రత్యేక దృష్టి పెట్టి జాప్యానికి కారణం తెలుసుకొని పరిష్కారం చూపుతూ ముందుకు వెళ్తున్నాం.
నేర పరిశోధనలో టెక్నాలజీ కీలకం
అన్ని అంశాలు ఆన్‌లైన్‌లో నమోదు
కేసు పరిస్థితిపై ప్రతీరోజు పర్యవేక్షణ
ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో టెక్, క్రైం బృందాలు
టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు సిబ్బందికి ట్రైనింగ్
‘సాక్షి’తో ఎస్పీ శబరీష్


