న్యూస్‌రీల్
‘కాలం మారింది.. పరిస్థితులు మారాయి.. నేరాల తీరు కూడా మారింది.. ఈ పరిస్థితికి అనుగుణంగా పోలీసులు కూడా మారాలి. అప్పుడే కేసుల పరిశోధన ముందుకు వెళ్తుంది. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల ఆస్తులకు రక్షణ ఇవ్వడం సులభతరం అవుతుంది. ఆ దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం’ అని ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు. క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్(సీపీటీఎన్‌ఎస్) అమలు, కేసుల పర్యవేక్షణ కోసం జిల్లాలో నిర్వహిస్తున్న డిజిటల్ అవర్, మొదలైన వివరాలు తెలిపారు. నూతన టెక్నాలజీ, పోలీస్ వ్యవస్థలో చోటుచేసుకున్న మార్పులు తదితర వివరాలను ఎస్పీ ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..


