ఉపాధ్యాయులు ఉత్తమ బోధన చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులు ఉత్తమ బోధన చేయాలి

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

● కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

నర్సింహులపేట: ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. గురువారం మండలంలోని పెద్దనాగారం, నర్సింహులపేట పీఎస్‌లు, కేజీబీవీ పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. పెద్దనాగారం పీఎస్‌లో వర్క్‌బుక్స్‌ పంపిణీ చేయలేదని, విద్యాసామర్థ్యాలు సక్రమంగా లేవని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీబీవీలో పరిసరాలు, వసతులతో పాటు విద్యార్థుల భోజనాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కంప్యూటర్‌ తరగతులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏజీసీఈ మందుల శ్రీరాములు, ఏఎంఓ అప్పారావు, ఎంపీడీఓ అంజలి, తహసీల్దార్‌ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

12,474 కొత్త పింఛన్లు మంజూరు

మహబూబాబాద్‌: జిల్లాలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 12,474 కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ స్నేహశబరీష్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 18 మండలాలు, 5 మున్సిపాలిటీ పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధిత పింఛన్లు మంజూరు చేశామన్నారు. 7,429 వితంతువు పింఛన్లు, 2,751 దివ్యాంగ, 1,025 కల్లుగీత, 19 చేనేత, 123 అవివాహిత ఒంటరి మహిళ, 11,27 వివాహిత ఒంటరి మహిళా పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

గడువులోగా పనులు పూర్తి చేయాలి

గడువులోగా జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం ఎన్‌హెచ్‌ భూ సేకరణ పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. భూములు కోల్పోయిన రైతులకు సకాలంలో పరిహారం అందేలా చూడాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అభివృద్ధి పనులకు భూసేకరణలో జాప్యం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, డీఆర్వో నాగలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement