ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

బయ్యారం: రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడాకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని సింగారంలో గురువారం ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమం సర్పంచ్‌ సరస్వతి అధ్యక్షతన నిర్వహించగా ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి భూమి ప్రధాన వనరు అని, భూసారాన్ని కాపాడుకోవడం ప్రతీ రైతు బాధ్యత అన్నారు. ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తమ నీటి అవసరాలకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఓ రాజు, ఉపసర్పంచ్‌ మమత తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన సేవలు అందించాలి

నెహ్రూసెంటర్‌: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించినట్లు తెలిసింది. ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ‘వచ్చిందే టైమ్‌.. చేసిందే డ్యూటీ’అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై స్పందించిన ఆస్పత్రి అధికారులు అన్ని విభాగాల వైద్యులు, నర్సులతో సమావేశం నిర్వహించి, నిర్లక్ష్యం వీడాలని సూచించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వ్యక్తిగత శుభ్రత పాటించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా ఇన్‌చార్జ్‌ సంక్షేమ అధికారి శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ బాలికల కళాశాల ప్రిన్సిపాల్‌ సదానందం అధ్యక్షతన మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గురువారం బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ.. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు. బాల్యవివాహాల నిషేధ చట్టం, పోక్సో చట్టం, లింగవివక్షత, మహిళా సాధికారత వంటి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్‌ మహేశ్వరి, జెండర్‌ స్పెషలిస్ట్‌ అరుణ, ఫైనాన్షియల్‌ లిటరసీ స్పెషలిస్ట్‌ సంధ్యారాణి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

జిన్నారెడ్డి పద్మజకు నియామక పత్రం అందజేత

మహబూబాబాద్‌ రూరల్‌: కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు జిన్నారెడ్డి పద్మజ గురు వారం నియామక పత్రం అందుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహి ంచడంతో పాటు నియామక పత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా అఖిల భారత మహిళా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు అల్కలాంబ హాజరై జిన్నారెడ్డి పద్మజకు నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వివిధ జిల్లాల మహిళా అధ్యక్షురాళ్లు, నాయకురాళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement