మహబూబాబాద్: మున్సిపాలిటీల్లోని చెత్త డంపింగ్ యార్డుల్లో ఇన్నాళ్లు బయోమైనింగ్ మిషనరీ ద్వారా చెత్తశుద్ధి చేశారు. నెల క్రితం దాని టెండర్ గడువు ముగిసింది. దీంతో చెత్త క్లీనింగ్, రీస్లైకింగ్ కోసం ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు మానుకోట మున్సిపాలిటీకి ఇటీవల సగం మిషనరీ సరఫరా చేశారు. ఆ మిషనరీ ఏర్పాటు కోసం చెత్త డంపింగ్ యార్డులో ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేశారు.
2022లో బయోమైనింగ్ ఏర్పాటు..
చెత్తశుద్ధి కోసం అన్ని మున్సిపాలిటీల్లో 2022లో బయోమైనింగ్ మిషనరీ ఏర్పాటు చేసి డపింగ్ యార్డుల్లో ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను శుద్ధి చేశారు. ఆ మిషనరీ గడువు గత సెప్టెంబర్‌లో ముగిసింది. ప్రభుత్వం దాని స్థానంలో సీడీఎంఏ నుంచి రూ.2.50కోట్ల విలువ గల ఫ్రెష్‌వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ మిషనరీలను సప్లై చేస్తోంది. దీనిలో భాగంగా మానుకోట మున్సిపాలిటీకి వారం క్రితం యూనిట్‌లో ట్రామిల్, వెట్ వేస్ట్ షడ్డర్ సప్లై కాగా.. బెయిలింగ్ మిషన్, వేబ్రిడ్జి, ప్లాస్టిక్ బాటిల్ షడ్డర్ మిషనరీ రావాల్సి ఉంది. ట్రామిల్ చెత్తలోని మట్టిని వేరు చేస్తుంది. వెట్‌వేస్ట్ షడ్డర్ తడి చెత్తను వేరు చేస్తుందని, బెయిలింగ్ మిషన్ చెత్తను వేరు చేస్తుందని అధికారులు తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్ షడ్డర్ బాటిళ్లను ముద్దగా చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
మిషనరీ పని విధానం..
మిషన్ కన్వేయర్ బెల్ట్‌పై చెత్తాచెదారం వేయగానే దానిపై నలుగురు వర్కర్లు కూర్చొని దానిలోని సీసాలు, ప్లాస్టిక్, క్లాతులు, అట్టాలు రీస్లైకింగ్ చేస్తారు. ఆతర్వాత మిషనరీలో మట్టి వేరు కావడంతో పాటు కవర్లు కూడా వేరు చేయబడుతాయి. తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. చెత్త అంతా శుద్ధి అవుతుంది. కాగా, మిషనరీ నిర్వహణపై పూర్తిస్థాయిలో సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. ప్రాథమిక సమాచారం మాత్రమే వారికి వివరించారు. మిషనరీ ఏర్పాటు చేసిన తర్వాత దాని నిర్వహణ పని తీరును క్షుణ్ణంగా వివరిస్తారని అధికారులు తెలిపారు.
డంపింగ్ యార్డులో షెడ్డు ఏర్పాటు..
మానుకోట మున్సిపాలిటీ పరిధి సిగ్నల్ కాలనీ సమీపంలోని చెత్త డంపింగ్ యార్డులో ఫ్రెష్‌వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు షెడ్డు నిర్మాణం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇతర గ్రాంట్లు రూ.30.70లక్షలతో షెడ్డుతో పాటు వర్మి కంపోస్ట్ ఎరువుకు సంబంధించిన ప్లాట్ ఫాం, ఇతర నిర్మాణాలు చేపట్టారు. పనులు 90శాతం పూ ర్తి కాగా.. మిషనరీ ఏర్పాటు చేసిన తర్వాత మిగి లిన పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిషనరీ ఏర్పాటుతో సీసాలు, అట్టాలు, కవర్ల ద్వారా ఆదాయం రావడంతో పాటు వర్మీకంపోస్ట్ ఎరువును నర్సరీల్లో ఉపయోగించవచ్చు. స్థలం వృథా కాదు.. చెత్త ఎప్పటికప్పుడు శుద్ధి అవుతుంది.
త్వరలోనే యూనిట్ ప్రారంభం
ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ మిషనరీ సగంపైగా సప్లై చేశారు. మిగిలిన మిషనరీ కూడా రెండు మూడు రోజుల్లో వస్తుంది. వాటిని షెడ్డులో ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన పనులు పూర్తి చేస్తాం. చెత్తశుద్ధి ప్రక్రియ పూర్తిగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది.
–సీహెచ్.ఉపేందర్,
మానుకోట మున్సిపాలిటీ ఇన్‌చార్జ్ కమిషనర్
ఫ్రెష్‌వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్‌తో చెత్తశుద్ధి
యూనిట్‌కు సంబంధించిన పలు
మిషనరీల రాక
షెడ్డు ఇతర ఏర్పాట్లు చేసిన సిబ్బంది
మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే నిర్వహణ


