ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల ఉచిత బీమా | - | Sakshi
Sakshi News home page

ప్రతీ కుటుంబానికి రూ.5లక్షల ఉచిత బీమా

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

వీసీలో ఉప ముఖ్యమంత్రి

మల్లు భట్టి విక్రమార్క

మహబూబాబాద్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రూ.5లక్షల ఇందిరమ్మ కుటుంబ ఉచిత జీవిత బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఉపముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క.. ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజుతో కలిసి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్బంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఈనెల 19నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పథకం ప్రారంభమవుతుందని, విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 18న గ్రామాల్లో టాంటాం ద్వారా ప్రచారం చేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ స్నేహశబరీష్‌, సంబంధిత అదికారులు పాల్గొన్నారు.

పెండింగ్‌ పనులు వెంటనే పూర్తి చేయాలి

కలెక్టర్‌ స్నేహశబరీష్‌

మహబూబాబాద్‌: డబుల్‌ బెడ్రూం ఇళ్ల పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై సంబంధిత అఽధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ స్నేహశబరీష్‌ మాట్లాడుతూ.. పూర్తయిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల సముదాయాల్లో డ్రెయినేజీ, అంతర్గత రోడ్లు, తాగునీరు ఇతర పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నిషేధిత ప్లాస్టిక్‌ను వినియోగించొద్దు

మహబూబాబాద్‌: పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని, ప్రధానంగా నిషేధిత ప్లాస్టిక్‌ను విక్రయించొద్దని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి అన్నారు. మున్సిపాలిటీల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం, ఎలాంటి అనుమతులు లేకుండానే షాపుల ఏర్పాటు, పర్యావరణానికి ముప్పు తదితర విషయాలపై సాక్షి దినపత్రికలో ‘ప్లాస్టిక్‌తో పరేషాన్‌’ అనే శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనంపై ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ ఉపేందర్‌, మేనేజర్‌ అంకూష్‌ స్పందించి తనిఖీలు చేయాలని ఆదేశించారు. దీంతో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌, పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి, మున్సిపల్‌ సిబ్బంది జిల్లా కేంద్రంలోని సుమారు 8ప్లాస్టిక్‌ విక్రయ, ఇతర షాపులను ముమ్మరంగా తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న షాపులకు జరిమానాలు విధించారు.

భక్తులకు అసౌకర్యం

కలగొద్దు

ఐనవోలు: ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలందిస్తూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా విధులు నిర్వహించాలని వరంగల్‌ సీపీ శ్వేత ఆదేశించారు. శుక్రవారం ఆమె ఐనవోలు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు అధికారులు పూల మొక్కలు అందించి స్వాగ తం పలికారు. సిబ్బంది నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్‌ ఆవరణలో కొబ్బరి మొక్క నాటారు. పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల వివరాలు, విచారణ నివేదికలు, స్టేషన్‌ నిర్వహణకు సంబంధించిన రిజిస్ట ర్లు, కిట్‌ ఆర్టికల్స్‌ను సీపీ పరిశీలించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం ఉన్నందున, ఇక్కడికి వచ్చే భక్తుల మనోభావాలను, ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈస్ట్‌ జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, మామునూరు ఏసీపీ వెంకటేశ్‌, పర్వతగిరి సీఐ సంతోశ్‌, ఎస్‌ఐలు అశోక్‌, వంశీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement