వారోత్సవాల కార్యక్రమాలు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

వారోత్సవాల కార్యక్రమాలు ఇలా..

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

మానుకోట పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, కార్యదర్శి శ్రీలత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల్లో సృజనాత్మకను, పఠనాసక్తిని పెంపొందించేందుకు వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 14న ఉదయం 11గంటలకు వారోత్సవాల సందర్భంగా మానవ జీవన విధానంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తామన్నారు. 15న ప్రత్యేక పుస్తక ప్రదర్శన, 16వ తేదీన 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు విద్యాసంస్థల్లో గ్రంథాలయాల ఏర్పాటు ప్రాముఖ్యతపై వ్యాసరచన పోటీ ఉంటుందన్నారు. 17న మానవ జీవితాలపై సోషల్‌ మీడియా ప్రభావంపై ఉపన్యాస పోటీలు, 18వ తేదీన 6నుంచి 10వ తరగతి విద్యార్థులకు దేశభక్తి, సామాజిక స్పృహ కలిగే పాటల పోటీలు ఉంటాయన్నారు. 19న ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు రంగోళీ పోటీలు ఉంటాయని, 20న వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఉంటుందని, విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement