మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండల పరిధిలో గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్‌శాఖ హైదరాబాద్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది శుక్రవారం విస్తృత దాడులు నిర్వహించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి పోరిక కరంచంద్ ఆధ్వర్యంలో బోడగుట్ట తండా, సుందరయ్య నగర్, బాబునాయక్ తండా, ఆమనగల్ బలరాంతండాప్రాంతాల్లో దాడులు నిర్వహించి 7 కేసులు నమోదు చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు ఈ దాడుల్లో 23 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని, 450లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, ఒక వాహనాన్ని సీజ్ చేశారు. దాడుల్లో ఎకై ్సజ్ సీఐ రాంప్రసాద్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఫోర్స్ అధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు.


