ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు | - | Sakshi
Sakshi News home page

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

● ఆర్డీఓ రాజేశ్వరి

మహబూబాబాద్‌ అర్బన్‌: ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, విద్యార్థులు భారత ఎన్నికల విధానంపై అవగాహన పెంచుకోవాలని ఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. మానుకోట మున్సిపల్‌ పరిధి అనంతారం మోడల్‌ స్కూల్‌లో శుక్రవారం ఎలక్ట్రోరల్‌ లిటరసీ క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. పాఠశాల, కళాశాలస్థాయి నుంచే విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, ఓటు హక్కుపై అవగాహన పెంచడానికి నియోజకవర్గస్థాయిలో వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించామన్నారు. జిల్లాస్థాయికి 10మంది విద్యార్థులు ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ చంద్రరాజేశ్వర్‌రావు, ఎంఈఓ ఆరుద్ర వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌రావు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement