మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు పోటెత్తిన మక్కలు

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ప్రాంగణం మక్కల రాశులతో గురువారం కళకళలాడుతూ కనిపించింది. మానుకోట మండలంతో పాటు చుట్టుపక్కల మండలాలకు చెందిన రైతులు తాము పండించిన మక్కలను విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చారు. కాగా, వ్యాపారులు 1,214 క్వింటాళ్లు (2,023 బస్తాలు) కొనుగోలు చేశారు. గరిష్ట ధర క్వింటాకు రూ.3,141, మోడల్‌ ధర రూ.3,085 పలికిందని ఏఎంసీ సెక్రటరీ వేముల వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే 80 క్వింటాళ్ల ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం విక్రయం జరగగా గరిష్ట ధర రూ.4,570, కనిష్ట ధర రూ.3,026 పలికింది. 456 క్వింటాళ్ల ఎస్‌ఎం రకం ధాన్యం విక్రయం జరగగా గరిష్ట ధర రూ.3,680, కనిష్ట ధర రూ.2,994 పలికింది. 311 క్వింటాళ్లు (889 బస్తాలు) పత్తి విక్రయం జరగగా గరిష్ట ధర రూ.8,802, మోడల్‌ ధర రూ.8,801, కనిష్ట ధర రూ.7,603 పలికింది. మూడు క్వింటాళ్ల మినుములు విక్రయం జరగగా క్వింటాకు ధర రూ.8,585 పలకగా, నాలుగు క్వింటాళ్ల బొబ్బర్లు విక్రయం జరగగా గరిష్ట ధర రూ.6,780, కనిష్ట ధర రూ.6,380 పలికింది. ఏడు క్వింటాళ్ల పెసళ్లు విక్రయం జరగగా క్వింటా గరిష్ట ధర రూ.7,812, కనిష్ట ధర రూ.5,360 పలికింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement