కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ అంతర్ కళాశాలల జోనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో వరంగల్ జట్టు విజయం సాధించింది. కేయూ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో మూడురోజులపాటు నిర్వహించిన ఇంటర్ జోనల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల జట్లు తలపడ్డాయి. ఈక్రమంలో గురువారం నిర్వహించిన ఫైనల్లో వరంగల్, ఖమ్మం జట్లు తలపడగా వరంగల్ విజయం సాఽధించింది. ఖమ్మం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు తమిళనాడులోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటారని కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ టి. శాస్త్రి తెలిపారు. విజేతలకు షీల్డ్‌తోపాటు ప్రశంస పత్రాలు అందజేశారు. ఇంటర్ కాలేజియెట్ టోర్నమెంట్స్ కమ్ సెలక్షన్స్ ఇన్చార్జ్ ఎస్. కుమార్, ఫిజికల్ డైరెక్టర్ల అసోసియేషన్ కేయూ అధ్యక్షుడు జె. సోమన్న, ఫిజికల్ డైరెక్టర్లు వెంకన్న, గోపికృష్ణ, అస్లాం, శ్రీనివాస్, మట్టెడ కుమారస్వామి, అప్జల్ కోటి తదితరులు పాల్గొన్నారు.
ద్వితీయ స్థానంలో ఖమ్మం జట్టు


