వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

భార్యతో గొడవపడి భర్త..

వర్ధన్నపేట : మద్యం మత్తులో భార్యతో గొడవ పడి భర్త మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఒంగూరి గిరిబాబు కుమారుడు శ్రీకాంత్‌(27) వంట పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ప్రతీరోజు పనికి వెళ్లి వచ్చిన డబ్బులతో మద్యం తాగి ఇంటికి వచ్చేవా డు. ఈ క్రమంలో బుధవారం కూడా రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఆలోచించకుండా ప్రతీరోజు తాగి వస్తావా అంటూ భార్య సౌమ్య ప్రశ్నించింది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. అనంతరం సౌమ్య తమ ఇంటి పక్కన ఉంటున్న కందగట్ల అనిల్‌ ఇంటికి వెళ్లింది. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో శ్రీకాంత్‌ ఒక్కడే ఉండడంతో వెళ్లి చూడాలని అనిల్‌ను కోరింది. దీంతో అనిల్‌ వెళ్లి చూడగా శ్రీకాంత్‌ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. వెంటనే చుట్టు పక్కల వారు, మృతుడి అన్న రాజశేఖర్‌.. శ్రీకాంత్‌ను వర్ధన్నపేట సీహెచ్‌సీ తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మద్యం మత్తులో భార్యతో గొడవపడి మనస్తాపంతో తన తమ్ముడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి అన్న రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

కుటుంబ కలహాలతో సోమిడిలో

ఆటో డ్రైవర్‌..

కాజీపేట: కుటుంబ కలహాలతో హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ సుంచు నాగ కిషన్‌ (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగ కిషన్‌ దంపతులకు గొడవలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆటో నడిపి ఇంటికి చేరుకున్న నాగకిషన్‌ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నడివాడలో యువతి..

మహబూబాబాద్‌ రూరల్‌ : మహబూబాబాద్‌ మండలం నడివాడ గ్రామానికి చెందిన మునిగె కుమారస్వామి, సుక న్య దంపతుల పెద్ద కుమార్తె సుష్మిత (25) గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. తల్లిదండ్రులు ఉదయం ఓ ఫంక్షన్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి రాగా సుష్మిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి క నిపించింది. వారు వెంటనే పోలీసులకు సమాచా రం తెలుపగా రూరల్‌ ఎస్సై పి.రాజు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలు సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడిందని, ప్రాథమిక సమాచారం మేరకు విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా, మృతురాలి కుటుంబీకుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వివరించారు. కాగా, సుష్మిత జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్సై ఉద్యోగ శిక్షణకు హాజరవుతోంది.

వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గురువారం ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో

ఆయా కుటుంబాలతోపాటు గ్రామాల్లో తీరని విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement