హైవేపై కారు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

హైవేపై కారు దగ్ధం

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: మల్లన్నగండి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు వెళ్తున్న ఓ జంటకు చేదు అనుభవం ఎదురైంది. తాము ప్రయాణిస్తున్న కారు బ్యానెట్‌ నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన వారు కారును పక్కకు ఆపి కారులోనుంచి దిగగా చూస్తుండగానే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ శివారు కొత్తపల్లి క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై పెట్రోల్‌బంక్‌ సమీపాన గురువారం జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ సుబేదారికి ఎండీ.అన్వర్‌ హుస్సేన్‌, అతని భార్య నేహాతన్వీర్‌తో కలిసి నిస్సాన్‌ టెర్రానో కారులో స్టేషన్‌ఘన్‌పూర్‌, చిల్పూరు మండలాల పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్‌ను చూసేందుకు గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు పల్లగుట్ట క్రాస్‌రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉండగా గుగూల్‌లో చూస్తూ దారితప్పి కొత్తపల్లి క్రాస్‌రోడ్డు వరకు వచ్చారు. అక్కడ యూ టర్న్‌ చూపించగా తిరిగి పల్లగుట్ట క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్లేందుకు కారును యూటర్న్‌ తీసుకున్నారు. ఆ సమయంలో కారు బ్యానెట్‌ నుంచి పొగలు రావడంతో పక్కకు నిలిపి దిగారు. వారు చూస్తుండగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారిపై ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరగడంతో కొత్తపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రాజేష్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది దగ్ధమైన కారును జేసీబీతో పక్కకు తప్పించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

● దంపతులిద్దరు సేఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement